Trump Greenland plan: చిన్నదేశాలపై డైరెక్ట్ వార్.. పెద్ద దేశాలపై టారిఫ్ వార్‌తో విరుచుకుపడుతున్న ట్రంప్.. ఇప్పటికే వెనుజువెలాపై పట్టు దక్కించుకున్నాడు. ఇరాన్‌పై ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు గ్రీన్‌లాండ్ స్వాధీనానికి స్కెచ్ వేస్తున్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను ఏ విధంగానైనా స్వాధీనం చేస్తామని వైట్ హౌస్‌లో మీడియాకు ప్రకటించారు. ప్రజల అభిప్రాయం అని పరిగణించకుండా ముందుకు సాగతామని స్పష్టం చేశారు. రష్యా, చైనా అడ్డకునే ప్రయత్నం చేస్తాయని ఆరోపించారు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వమని హెచ్చరించారు. చర్చలు సఫలమైతే బాగుంటుంది, లేకపోతే సైనిక, ఆర్థిక ఒత్తిళ్లతో బలవంతంగా అయినా తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. వచ్చే వారంలో డెన్మార్క్, గ్రీన్‌లాండ్ నేతలతో విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్చలు నిర్వహిస్తారని తెలిపారు.
ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా–రష్యా నౌకలు..
గ్రీన్‌లాండ్ చుట్టూ చైనా, రష్యా నౌకలు మోహరించి ఖనిజాలు, చమురు వెతుకుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఆర్కిటిక్ గైస్, రేర్ ఎర్త్ ఎర్త్ మెటల్స్ వంటి వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతం అమెరికా రక్షణకు కీలకమని పేర్కొన్నారు. వాసింగ్టన్ చర్యలు జోక్యం చేసుకోకపోతే ప్రత్యర్థులు ఆధిపత్యం స్థాపిస్తారని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉన్నా, స్వయం పాలన ఉన్న దాని భవిష్యత్ అంతర్జాతీయ ఉద్రిక్తిని సృష్టిస్తోంది.
చారిత్రక నేపథ్యం..
2019లో ట్రంప్ మొదటిసారి గ్రీన్‌లాండ్ కొనుగోలు ప్రతిపాదన చేశారు. డెన్మార్క్ దాన్ని తిరస్కరించడంతో ఆగిపోయింది. ఇప్పుడు వెనెజువెలా విజయం తర్వాత మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలు, స్వయం నిర్ణయాధికారం విధానాలు ఈ ప్రణాళికకు సవాలుగా మారాయి. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ ఇది ’అసాధ్యమైనది’ అని ముందు చెప్పారు.
అంతర్జాతీయ పరిణామాలు..
డెన్మార్క్, గ్రీన్‌లాండ్ నేతలు ట్రంప్ ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్–ఫ్రెడ్రిక్Š నీల్సెన్ ‘మేము అమెరికాకు చెందినవాళ్లం కాదు‘ అని స్పష్టం చేశారు. ఐరోపా యూనియన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పిలుపునిచ్చింది. రష్యా, చైనా సాకుతో ఆక్రమించడం మరికాదని పేర్కొంది.
వెనెజువెలా చమురు లాభాలు..
వెనెజువెలా చమురు ఆదాయం రెండు దేశాల ప్రజలకు మేలు చేస్తుందని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోని అతి పెద్ద చమురు రిజర్వుల్లో ఒకటైన వెనెజువెలాలోని పీడీవీఎస్‌ఏ కంపెనీలతో సమావేశమై, ఉత్పత్తి పెంచేందుకు ప్రోత్సాహం ఇచ్చారు. ఈ చర్యలతో అమెరికాలో చమురు ధరలు 20–30% తగ్గుతాయని అంచనా. వెనెజువెలా ఆర్థికం పునరుద్ధరణకు ఇది కీలకమని చెప్పారు. ఎక్సాన్ మొబైల్, చెర్వాన్ వంటి అమెరికన్ కంపెనీలు ఇప్పటికే అక్కడ ఆపరేషన్లు ప్రారంభించాయి.