Toyota Highlander 2026: సుదూర ప్రయాణం చేయడానికి ఒకప్పుడు పబ్లిక్ ట్రావెల్స్ ను ఉపయోగించేవారు.. కానీ ఇప్పుడు సొంత వాహనం ఉండాలని కోరుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలతో పాటు పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి SUV వెహికల్ ఉండాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా సెవెన్ సీటర్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా Toyota కంపెనీ Highlander 2026 నీ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో పొందుపరచడంతో దీనిని చూసినవారు వెంటనే కొనాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే గతంలో మార్కెట్లో ఉన్న హైలాండ్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాహనంలో ఎలాంటి మార్పులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
టయోటా హైలాండ్ 2026 ఎక్స్టీరియర్ డిజైన్ అద్భుతం అని అనుకోవచ్చు. ఆధునిక ఎల్ఈడి లైటింగ్ తో పాటు.. బోల్డ్ గా కనిపించే పానెల్ ఉండనుంది. ముందు నుంచి వెనుక వరకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దీని ఇన్నర్ విషయానికి వస్తే ఇందులో 7 to 8 సీడ్స్ ఉండే అవకాశం ఉంది. ఇవి మూడు వర్షాల వరకు ఉంటాయి. డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే తోపాటు రీయర్ కెమెరా కూడా అమర్చారు. అలాగే డాష్ బోర్డు తో పాటు డోర్ ట్రిమ్ అప్డేట్ చేయబడ్డాయి. క్యాబిన్ మొత్తం ఆకర్షణీయంగా ఉండడంతో పాటు సాఫ్ట్ టచ్ ను కలిగి ఉంటుంది
ఈ కారులో హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఉండనుంది. 2.4 లీటర్ టర్బో చార్జెడ్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇది 265 హెచ్పి పవర్ తో పాటు 310 పార్కులు రిలీజ్ చేస్తుంది. ఎయిట్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఇది లీటర్ ఇంధనానికి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ప్రయాణికులకు భద్రతను ఇస్తాయి. ఈ ఫీచర్లతో హైవేపై లాంగ్ జర్నీ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.
2026 సంవత్సరంలో టయోటా హైలాండ్ ప్రీమియం కార్ల వలె కొత్త అనుభూతిని అందించనుంది. ఎస్ యు విభాగంలో ఇది హైలెట్గా నిల్వనుంది. ఇది మార్కెట్లోకి వస్తే రూ. 45 లక్షల నుంచి రూ. 55 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో AWD తో కూడిన హై ఎండ్వే రియంటు తోపాటు లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంది. ఉమ్మడి కుటుంబం కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి ఈ ఏడాది ఇది బెస్ట్ కారుగా నిలవనుంది.