Homeఅంతర్జాతీయంTrump Tariff : ట్రంప్‌ టారిఫ్‌ ఎదురుదెబ్బ.. అమెరికన్న హ్యాండ్స్‌ ఆఫ్‌.. ఉలిక్కిపడ్డ అగ్రరాజ్యం!

Trump Tariff : ట్రంప్‌ టారిఫ్‌ ఎదురుదెబ్బ.. అమెరికన్న హ్యాండ్స్‌ ఆఫ్‌.. ఉలిక్కిపడ్డ అగ్రరాజ్యం!

Trump Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆయన వివాదాస్పద విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ‘హ్యాండ్స్‌ ఆఫ్‌’(Hands off) పేరుతో వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 50 రాష్ట్రాల్లో 1,200కు పైగా ప్రాంతాల్లో జరిగిన ఈ ర్యాలీలు అమెరికా చరిత్రలో అరుదైన సంఘటనగా నిలిచాయి. ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి, ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

Also Read : అలేఖ్య చిట్టి పికిల్స్‌ పై స్పందించిన ట్రంప్‌.. ఇది మామూలు ర్యాంగింగ్‌ కాదు

నిరసనల్లో అన్నివర్గాలవారు..
ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలతో సహా 150కి పైగా సంఘాలు మద్దతు తెలిపాయి. ట్రంప్‌ పరిపాలనలో సమాఖ్య సంస్థల తొలగింపు, ఆరోగ్య సంరక్షణ కోతలు, వలసదారుల పట్ల కఠిన విధానాలు, లింగమార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి అంశాలు నిరసనకారుల ఆగ్రహానికి ప్రధాన కారణాలుగా మారాయి. నిరసనకారులు మాట్లాడుతూ, ట్రంప్‌(Trump), ఎలాన్‌ మస్క్‌(Elon Musk)లు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికే సవాల్‌ విసురుతున్నాయని, వలసదారుల చికిత్స దారుణంగా ఉందని ఆరోపించారు.

2017 తర్వాత ఇదే పెద్దది..
2017 తర్వాత అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఉద్యమం ట్రంప్‌ పాలనలో ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని స్పష్టంగా చాటుతోంది. నిరసనకారులు తమ డిమాండ్లను బలంగా వినిపిస్తూ, ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో(Social Media) వీరి సందేశాలు వేగంగా వ్యాపిస్తుండటంతో, ఈ ఉద్యమం మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.
పరిస్థితిని అదుపు చేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నిరసనలు కేవలం ట్రంప్‌ విధానాలపైనే కాక, అమెరికా రాజకీయ వ్యవస్థలో లోతైన విభేదాలను కూడా బయటపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటనలపై చర్చలు జరుగుతుండగా, అమెరికా భవిష్యత్‌ దిశ ఏ విధంగా సాగుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version