Alekhya Chitti Pickles: ‘అలేఖ్య చిట్టి పికిల్స్‘ సిస్టర్స్(Alekhya Chitti Picls) (చిట్టి, అలేఖ్య, రమ్య) పేరు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. కొంతకాలంగా పచ్చళ్ల వ్యాపారంతో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సోదరీమణులు, సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించారు. అయితే, కస్టమర్లపై బూతులతో విరుచుకుపడిన ఆడియోలు లీక్ కావడంతో వారు ఒక్కసారిగా వైరల్ అయ్యారు. దీంతో వారిపై మీమ్స్, ట్రోల్స్, వీడియోలు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి.
Also Read : తిట్టినందుకు లెంపలేసుకుంటున్నా.. చేతులుకాలాక ఆకులు పట్టుకున్న అలేఖ్య చిట్టి
ప్రముఖుల ఆగ్రహం..
అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు. ఒక రకంగా ర్యాగింగ్(Raging) చేస్తున్నారు. తాజాగా సమంత, ప్రియదర్శితోపాటు చాలా మంది అలేఖ్య సిస్టర్స్ తీరును తప్పు పట్టారు. కొందరు వారికి మద్దతుగా నిలుస్తున్నా.. ట్రోల్స్ ముందు వారు తేలిపోతున్నారు. మరోవైపు ఈ వివాదంపై రమ్య(Ramya) వివరణ ఇచ్చింది. అంతకు ముందు పోస్టు పెట్టిన వ్యక్తిని తిట్టబోయి.. ఆ పోస్టు మరో కస్టమర్‌కు పోస్ట్ అయిందని తెలిపింది. దీనికి సారీ చెబుతున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో తమను వాట్సాప్‌లో చాలా మంది వేదిస్తున్నారని తెలిపి సానుభూతి పొందేప్రయత్నం చేసింది. కానీ, నెటిజన్లు(Netigens) ఆ ముగ్గురినీ అస్సలు వదలడం లేదు.
తాజాగా ట్రంప్ కూడా..
వివిధ రకాల మీమ్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లు అలేఖ్య సిస్టర్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పేరుతో ట్రోల్ చేస్తున్నారు. అలేఖ్య పికిల్ సిస్టర్స్ మాట్లాడిన మాటలకు నేను చింతిస్తున్నాను. కస్టమర్(Custamar) గురించి వారు మాట్లాడిన తీరు బాధ కలిగించింది. ఇందుకు అలేఖ్య పికిల్స్‌ను బ్యాన్ చేయాలని నేను పిలుపునిస్తున్నా’ అని ట్రంప్ మాట్లాడినట్లుగా.. ఓ వీడియోను పోస్టు చేశారు. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ మాస్ ర్యాగింగ్‌ను తట్టుకోలేక అలేఖ్య సిస్టర్ వాట్సాప్ నంబర్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా నిలిపివేశారు.
Also Read : అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియా ట్రెండ్.. సంబరం నుంచి వివాదం వరకు</a
Donald Trump’s response to the ALEKHYA CHITTI PICKLES issue.#DonaldTrump#AlekyaChittiPickles pic.twitter.com/Q3LPKuSOcG
— SHOURYAANGA (@shouryaanga1) April 5, 2025