Homeఅంతర్జాతీయంDonald Trump Iran Warning: మరో కొత్త వేశం వేసిన ట్రంప్‌.. ఇరాన్‌కు తాజాగా మరో...

Donald Trump Iran Warning: మరో కొత్త వేశం వేసిన ట్రంప్‌.. ఇరాన్‌కు తాజాగా మరో వార్నింగ్‌

Donald Trump Iran Warning: పశ్చిమాసియాలో శాంతిపై మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. మొదట రెండు ఇరాన్‌–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కుదిరింది. తర్వాత మరో పది రోజులు పొడిగించారు. ఇప్పుడు అది కూడా ముగిసే సమయం దగ్గరపడుతోంది. మరోవైపు శాంతి చర్చలు ఎటూ తేలలేదు. శాంతి ఒప్పందంపై ఎవరూ మెట్టు దిగడం లేదు. ఇరాన్‌ కాస్త వెనక్కు తగ్గినా అమెరికా పట్టు సడలించడం లేదు. దీంతో మళ్లీ యుద్ధం మొదలవుతుందన్న టెన్షన్‌ ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఈ క్రమంలో రైఫిల్‌ పట్టుకుని పోస్ట్‌ చేసిన ట్రంప్, ‘ఇక మంచివాడిగా ఉండను‘ అని హెచ్చరించారు. ఇరాన్‌ తెలివిగా వ్యవహరించి అణు ఒప్పందంపై దౌత్య పరిష్కారం తీసుకొస్తే మంచిదని, లేకపోతే దూకుడుగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితి ఇదీ..
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్రమై, ఇరాన్‌ అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. హార్మూజ్‌ జలసంధి మూసివేత, ఇరాన్‌ దాడులు పరిస్థితిని మరింత సున్నితం చేశాయి. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ప్రాణత్యాగానికి సిద్ధత ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్‌ తాజాగా గన్‌ పట్టుకున్న ఫొటోతు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశాడు.

ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్‌..
ఈ ప్రకటన చమురు ధరలు, ప్రపంచ భద్రతపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒపెక్‌ + కూటమి ఇప్పటికే ఒత్తిడిలో ఉండగా, యుద్ధ పరిస్థితి గ్లోబల్‌ ఎనర్జీ సరఫరాను దెబ్బతీస్తుంది. దౌత్య మార్గాలు మూసివేత ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షభానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌ నుంచి క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులపై భారత్‌ ఆధారపడుతోంది. యుద్ధం ఇంధన ధరలు, ద్రవ్యోల్బణాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular