Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna Stunt Jump: 80 అడుగుల ఎత్తు నుండి దూకేసిన హీరోయిన్ రష్మిక.. పూర్తి...

Rashmika Mandanna Stunt Jump: 80 అడుగుల ఎత్తు నుండి దూకేసిన హీరోయిన్ రష్మిక.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Rashmika Mandanna Stunt Jump: అందంతోనే కాదు , నటనతో కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించే హీరోయిన్స్ కి కెరీర్ ఎక్కువ కాలం సాగుతుందని అందరూ అంటుంటారు. మన సౌత్ లో ఇలా అందం , టాలెంట్ రెండు సమపాళ్లలో ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ ఉన్నారు. ఆ తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందాన(Rashmika Mandanna). కెరీర్ ప్రారంభం లో ఈమె పెద్దగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయలేదు. క్యూట్ & బబ్లీ […]

Rashmika Mandanna Stunt Jump: అందంతోనే కాదు , నటనతో కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించే హీరోయిన్స్ కి కెరీర్ ఎక్కువ కాలం సాగుతుందని అందరూ అంటుంటారు. మన సౌత్ లో ఇలా అందం , టాలెంట్ రెండు సమపాళ్లలో ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ ఉన్నారు. ఆ తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందాన(Rashmika Mandanna). కెరీర్ ప్రారంభం లో ఈమె పెద్దగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయలేదు. క్యూట్ & బబ్లీ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చింది. కానీ పుష్ప నుండి మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది. గత ఏడాది ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె ‘మైసా’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం లో నటించింది.

ఇప్పటికే ఈ సినిమాలోని రష్మిక లుక్ కి , విడుదల చేసిన ఎవరు కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం రష్మిక ఎంత కష్టపడిందో ఆ చిత్ర దర్శకుడు రవీంద్ర ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో రష్మిక గోండు గిరిజన యువతిగా నటిస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ఆమె చేసిన హోమ్ వర్క్ ని చూసి ఆశ్చర్యపోయాను. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ని కేరళలో మొదలు పెట్టాము. అయితే ఈ చిత్రం లోని ఒక కీలక యాక్షన్ సన్నివేశం లో రష్మిక 80 అడుగుల ఎత్తు నుండి దూకేసింది. ఎలాంటి డూప్స్ వాడకుండా సొంతంగా ఈ సన్నివేశాన్ని చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నెటిజెన్స్ రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించడం మొదలు పెట్టారు.

ఎందుకంటే ఇప్పుడున్న పాన్ ఇండియన్ హీరోలు కేవలం 10 అడుగుల ఎత్తు నుండి కూడా దూకలేక డూప్స్ ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటిది రష్మిక ఏకంగా 80 అడుగుల ఎత్తు నుండి దూకడం సాధారణమైన విషయం కాదు అంటూ కొనియాడుతున్నారు. ఇక రీసెంట్ గానే మొదలైన కేరళ షెడ్యూల్ లో 20 రోజుల పాటు కెచ్చా మాస్టర్ సారథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధానమైన హైలైట్స్ గా నిలుస్తాయని అంటున్నాడు డైరెక్టర్. అంతే కాదు , రష్మిక ఈ పాత్ర కోసం బ్యాంకాక్ లో కొన్ని రోజుల పాటు 8 గంటలకు పైగానే ఫైటింగ్ మరియు స్తంట్స్ విషయం లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకొని , ప్రాక్టీస్ కూడా చేసిందని అంటున్నారు. ఆమె ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టి పని చేసింది , వాటిని వెండితెర మీద చూసినప్పుడు మీరంతా ఆశ్చర్యపోతారు అంటూ డైరెక్టర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper