Trump Bitcoin: అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి వాషింగ్‌టన్‌లోని వైట్‌హౌస్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. నెవ్వర బిఫోన్ అన్నట్లుగా ట్రంప్ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహింబోతున్నారు. దీంతో అమెరికా అంతా నూతన అధ్యక్షుడి మేనియా నెలకొంది. అధ్యక్ష పీఠంపై కూర్చోవడానికి ఒక రోజు ముందే బిట్ కాయిన్‌ను ట్రంప్ మార్కెట్‌లోకి తెచ్చారు. $TRUMP పేరిట తెచ్చిన ఈ కాయిన్(టెకెన్)కు మార్కెట్‌లో అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. ఔత్సాహిక పెట్టుబడిదారులు దీనిని ఎగబడి కొనుగోలు చేశారు. దీంతో ఈ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గంటల్లోనే ఏకంగా 5.5 బలియన్ డాలర్లకు చేరినట్లు వార్తలు వచ్చాయి.
100 కోట్ల టోకెన్లు..
ప్రస్తుతం 20 కోట్ల కాయిన్స్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. రాబోయే మూడేళ్లలో దశలవారీగా 80 కోట్ల కాయిన్లు మార్కెట్‌లోకి తీసుకువస్తామని $TRUMP మీమ్ కాయిన్లను జారీ చేసిన వెబ్‌సైట్ ప్రకటించింది. ట్రంప్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్‌ఏల్సీ ఈ కాయిన్ విక్రయాల బాధ్యతను చూసుకుంటోంది.
గతంలో ఇలా..
సీఐసీ డిజిటల్ ఎల్‌ఎల్సీ గతంలో ట్రంప్ బ్రాండ్ పేరుతో పాదరక్షలు, సుగంధ ద్రవ్యాలు విక్రయించింది. ట్రంప్ పేరుతో గతంలో బైబిళ్లు, బంగారు బూట్లు, వజ్రాల వాచీలు కూడా అమ్మారు. ఇప్పుడు మీమ్ కాయిన్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కాయిన్లను స్కామర్లు వినియోగిస్తారు. అధిక లాభాలు గడించాలనన అత్యాశాపరులైన పెట్టుబడిదారుల సంపదను కాజేసేందుకు వీటిని వాడతారని క్రిప్టో కరెన్సీ మార్కెట్ వర్గాలు తెలిపారు.
క్రిప్టో కరెన్సీలో తుఫాన్..
క్రిప్టోటైమ్స్ ప్రకారం , సోలానాపై డొనాల్డ్ ట్రంప్ $TRUMP కాకోయిన్ లాంచ్ క్రిప్టో ప్రపంచాన్ని తుఫానుగా తీసుకుంది, అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హాటెస్ట్ టాపిక్‌గా మారింది. ప్రారంభించిన రెండు గంటల్లోనే, నాణెం 4,200% పైగా పెరిగింది, $7.7 బిలియన్ల మార్కెట్ క్యాప్‌కు చేరుకుంది. ఆకస్మిక ప్రయోగం, దాని భారీ వృద్ధితో కలిపి, సోషల్ మీడియాలో చర్చలు, గందరగోళం మరియు FOMO దారితీసింది. న్యూస్ పోర్టల్ ప్రకారం, ఒక వ్యాపారి త్వరగా USDC ఉపయోగించి దాదాపు 1.1 మిలియన్ డాలర్లకు దాదాపు 6 మిలియన్ TRUMP నాణేలను కొనుగోలు చేశాడు. 90 సెకన్లలో, ఈ వ్యాపారి పెట్టుబడి విలుమ23 మిలియన్ డాలర్లకు చేరింది.