NTR : స్టార్ హీరోల సినిమాలను చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆయా హీరోల సినిమాలను చూసి వాళ్ళ అభిమానులు చాలావరకు ఆనందపడతూ ఉంటారు… ఒక సినిమా సక్సెస్ సాధిస్తే ఆ హీరో ఇమేజ్ పెరగడమే కాకుండా ఆయన మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. ఇక హీరోల అభిమానులు సైతం ఆ సినిమాని సూపర్ హిట్ చేయడానికి ఒకటికి రెండుసార్లు సినిమాలను చూస్తూ వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)… ఈయన తీసిన ‘బాహుబలి 2’ (Bahubali 2) సినిమా ఇండస్ట్రీలో భారీ రికార్డులను కొల్లగొడుతూ 1900 కోట్ల కలెక్షన్లు రాబట్టడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో మరొక మెట్టు పైకి ఏది కాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR ), రామ్ చరణ్ (Ram Chran) కలిసి నటించడంతో ఈ సినిమా చూడటానికి వాళ్ల అభిమానులు చాలా వరకు ఆసక్తి చూపించారు. తద్వారా ఈ సినిమా దాదాపు 1300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి మార్క్ మేకింగ్ అయితే ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో పులితో ఫైట్ చేసిన సీన్ ప్రతి ప్రేక్షకుడికి ఫేవరెట్ సీన్ అనే చెప్పాలి. ఇక ఈ పులి ఫైట్ ని ఎన్టీఆర్ ఎలా చేశాడు. రాజమౌళి ఈ ఫైట్ ని ఎలా చిత్రీకరించాడు. పులి ప్లేస్ లో ఏం పెట్టి షూట్ చేసి ఆ తర్వాత గ్రాఫిక్స్ లో పులిని ఆడ్ చేశారు అనే విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఎట్టకేలకు ఆ మేకింగ్ వీడియోను యూట్యూబ్ లోకి అవలేబుల్ లోకి తీసుకువచ్చారు. కాబట్టి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు పులి లేకుండా అక్కడ రాజమౌళి చాలా డిఫరెంట్ ప్లానింగ్ తో ఆ సీన్ ను చిత్రీకరించి ఆ తర్వాత పులి ఆడ్ చేయడం చూసిన ప్రతి ఒక్కరు రాజమౌళి టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు. నిజానికి ఎన్టీఆర్ కూడా ఈ సీక్వెన్స్ కోసం చాలా వరకు కష్టపడినట్టుగా మనకు ఈ మేకింగ్ వీడియోలో చాలా స్పష్టంగా తెలుస్తోంది…
ఇక ఏది ఏమైనా కూడా ఒరిజినల్ పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసినట్టుగా మనకు ఆ ఫీల్ ని కల్పించిన దర్శక ధీరుడు రాజమౌళి వల్లే ఇలాంటివి సాధ్యమవుతాయి అంటూ ప్రతి ఒక్కరు అతని టాలెంట్ ని మెచ్చుకుంటూ అతని మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇకమీదట కూడా తన సినిమాలతో చాలా వండర్స్ ను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు…