María Corina Machado: అమెరికా వెనిజులా పై దాడి చేసింది. పరాయి దేశాల మీద దాడి చేయడం అమెరికా కు కొత్త కాదు. కానీ వెనిజులాపై దాడిచేసి.. ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేయడం ట్రంప్ మూర్ఖత్వానికి పరాకాష్ట. హ్యూగో చావెజ్ బతికి ఉన్నంతవరకు వెనిజులా ను అమెరికా ఏమీ చేయలేకపోయింది. వెనిజులా ప్రాంతంలో ఉన్న చమురు నిలువలపై అమెరికా ఎప్పటినుంచో కన్ను వేసింది. పైగా ఆ నిలువలను తమ వేనని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా కొంతకాలంగా వెనిజులా దేశంపై విమర్శలు చేస్తోంది. అక్రమంగా మాదక ద్రవ్యాలను మా దేశంలోకి రవాణా చేస్తున్నారని మండిపడుతోంది. దీనికి తోడు ఇటీవల సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధిపతి నికోలస్ మదురో, ఆయన భార్యను అరెస్ట్ చేయించారు.
పైగా 2025 సంవత్సరానికి సంబంధించి మారియా కోరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి అందేలా ట్రంప్ తెరవెనక కృషి చేశాడు.. వాస్తవానికి ఈ శాంతి బహుమతి తనకు రావాలని ట్రంప్ కోరుకున్నాడు. కానీ శాంతి బహుమతి కంటే, వెనిజుల ప్రాంతంలో ఉన్న చమురు నిల్వలు అతడిని ఊరించాయి. అందువల్లే మచాడోకు శాంతి బహుమతి వచ్చేలా చేసిన అతడు.. ఆ తర్వాత వెని జులా ప్రాంతంలో దాడులు మొదలుపెట్టాడు. ముందుగా అక్కడ సైన్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రతిపక్ష నేత మచాడోతో తెర వెనుక సంప్రదింపులు జరిపాడు. ఇప్పుడు మదురో అరెస్ట్ అయ్యాడు కాబట్టి.. మచాడో ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెడతాడు ట్రంప్. ఆ తర్వాత చమురుపై గుత్తాధిపత్యాన్ని సాధిస్తాడు.
చమురు నిలువలపై అమెరికా ఆధిపత్యం ఇప్పుడు పెరిగినప్పటికీ.. దీర్ఘకాలంలో ఆదేశానికి నష్టమే ఉంటుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మనదేశంలో ఆయిల్ ధరలు పెరుగుతాయి. అమెరికా నిర్వాకం వల్ల లాటిన్ అమెరికా దేశాల మధ్య ఐక్యత పెరుగుతుంది. వాస్తవానికి మెక్సికో బార్డర్లో గోడకట్టి అక్రమ వలసలను ఆపుతానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశాడు. దానికి తగ్గట్టుగానే బలమైన బార్డర్ నిర్మించే పనిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ఏ దేశం నుంచి తమ దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు వస్తున్నాయో తెలియదా? కాకపోతే ట్రంప్ ఆలోచన వేరే.. చమురు నిల్వలు, వ్యూహాత్మకమైన ఎయిర్ బేస్ లు.. ఇంకా చాలా అవకాశాలు కావాలి కాబట్టి వెనిజులా మీద పడిపోయాడు. మచాడోకు నోబెల్ శాంతి బహుమతి అక్కడ వెనక ట్రంప్ ఇంతటి కుట్రకు పాల్పడ్డాడు.
అమెరికా అనేది మొదటి నుంచి కూడా సామ్రాజ్యవాద దేశం. తన అనుకూల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా సరే అమెరికా పాలకులు ప్రయాణం సాగిస్తుంటారు. దుర్మార్గాలకు పాల్పడుతుంటారు. ఇతర దేశాల మీద ఏకపక్షంగా దాడులు చేస్తుంటారు. తనకు అనుకూలంగా ఉన్న దేశాలలో వ్యాపారాలు చేస్తుంటారు. అంతిమంగా మాత్రం అమెరికా అనుకూల విధానాలకు మాత్రమే జై కొడతారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది కూడా అదే.