https://oktelugu.com/

Akkineni Nagarjuna : సమంత పై నాగార్జున సెటైర్లు..తప్పుడు ఆలోచనలు బుర్రలో నుండి తీసేయ్ అంటూ వార్నింగ్..అసలు ఏమైందంటే!

కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై చేసిన అసభ్యమైన వ్యాఖ్యలకు సమంత కూడా ఘాటుగా స్పందించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక్క నాగ చైతన్య తో తప్ప, ఆమెకు ఇప్పటికీ అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే సమంత, నాగార్జున మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 03:50 PM IST

    Akkineni Nagarjuna

    Follow us on

    Akkineni Nagarjuna :  నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా సమంత ఇప్పటికీ అక్కినేని కుటుంబం లో కొంతమందితో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తుంది. ముఖ్యంగా అక్కినేని అఖిల్ తో ఆమె ఇప్పటికీ స్నేహం గానే ఉంటుంది. ఆయన ప్రతీ పుట్టినరోజుకి సమంత తన ఇంస్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉండే విషయం మన అందరికీ తెలిసిందే. అదే విధంగా తన మాజీ మామయ్య నాగార్జున అంటే కూడా ఈమెకి ప్రత్యేకమైన అభిమానం. రీసెంట్ గానే కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై చేసిన అసభ్యమైన వ్యాఖ్యలకు సమంత కూడా ఘాటుగా స్పందించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక్క నాగ చైతన్య తో తప్ప, ఆమెకు ఇప్పటికీ అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే సమంత, నాగార్జున మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగ చైతన్య తో వైవాహిక జీవితం గడుపుతున్నప్పుడు నాగార్జున నుండి ‘మన్మథుడు 2’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన సమంత, మామయ్య గారు ఈ వయస్సులో ఈ లిప్ లాక్ సన్నివేశాలు ఏమిటి?, చూసేందుకు ఏదోలా ఉంది అని మొహమాటం లేకుండా అడిగేసిందట. అప్పుడు నాగార్జున నీ బుర్రలో నుండి అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి, కేవలం ట్రైలర్ ని ట్రైలర్ లాగానే చూడు అని చెప్పాడట. ఆ తర్వాత ట్రైలర్ ని మరోసారి చూసిన సమంత, చాలా బాగుంది మామయ్య అని చెప్పిందట. ఈ విషయాన్ని అప్పట్లో నాగార్జున ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు నాగార్జున. అప్పట్లో ఈ ఇంటర్వ్యూ పెద్ద చర్చకి కూడా దారి తీసింది.

    ఇక సమంత సినిమాల విషయానికి వస్తే మయోసిటిస్ కి శస్త్ర చికిత్స తీసుకున్న తర్వాత, డాక్టర్ల సలహా మేరకు ఏడాది నుండి విశ్రాంతి తీసుకుంటున్న సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా మారింది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రేపటి నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత రా ఏజెంట్ గా కనిపించనుంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ లో సమంత ని విలన్ గా చూపించి భయపెట్టిన రాజ్ & డీకే ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. థియేట్రికల్ ట్రైలర్ లో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసి ఆశ్చర్యపోతున్న ఆమె అభిమానులు, ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. రేపటి నుండి ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది.