Trump Immigration Policy: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump_ దూకుడైన నిర్ణయాలతో అటు అమెరికన్లను, ఇటు ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. అక్రమ వలసదారులపై ఉక్పుపాదం మోపుతున్న ట్రంప్ ఇప్పటికే 40 వేల మందిని వారి దేశాలకు పంపించారు. ఇమ్మిగ్రేషన్ రూల్స్(immigration Ruls) మార్చేశారు. 40 దేశాలపై టూర్ బ్యాన్ విధించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులకు సంబంధించిన కఠిన విధానాలతో ఆందోళన కలిగిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఆకస్మిక నిర్ణయాలు వలసదారుల్లో గందరగోళం రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్(Micro saft), గూగుల్(Google), అమెజాన్(Amezan) వంటి టెక్ దిగ్గజ సంస్థలు తమ హెచ్1బీ వీసాదారులను అప్రమత్తం చేస్తూ, దేశం వీడొద్దని సూచించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తిరిగి అమెరికా(America)లోకి ప్రవేశించడంపై అనిశ్చితి నెలకొనడంతో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో హెచ్1బీ వీసాదారులైన ఇద్దరు భారతీయ ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ, తిరిగి ప్రవేశానికి అనుమతి లభించకపోతుందేమోనన్న భయంతో భారత్ పర్యటన ప్రణాళికలను వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.
సిటిజన్‌షిప్ రద్దు..
జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై మరో భారతీయ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం మారితే భవిష్యత్తులో జన్మించే పిల్లలు ఏ దేశానికి చెందని పరిస్థితి వస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. అమెరికా పౌరులు కాని వారంతా చట్టవిరుద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నారని మరొకరు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అవసరమైన పత్రాలను ఎప్పుడూ వెంట ఉంచుకుంటున్నామని కొందరు వెల్లడించారు. ఇక హెచ్1బీ వీసా అనేది అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే తాత్కాలిక వీసా(Temprary Vica). ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఏటా 65 వేల వీసాలను లాటరీ విధానంలో మంజూరు చేస్తారు. భారత్, చైనా, కెనడా నుంచి వచ్చే నిపుణులు ఈ వీసాలను ఎక్కువగా పొందుతున్నారు. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు వీరిని పెద్ద సంఖ్యలో నియమించుకుంటూ ఐటీ రంగ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.
కీలక అడ్వయిజరీ జారీ..
ఇటీవల అమెరికా వలస విభాగం కీలక అడ్వైజరీ(Advaisory) జారీ చేసింది. హెచ్1బీ, ఎఫ్–1, గ్రీన్‌కార్డు హోల్డర్లు అయిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అమెరికాలోకి ప్రవేశం, నిష్క్రమణ సమయంలో తనిఖీలు కఠినంగా ఉంటాయని, సహనంతో వ్యవహరించాలని తెలిపింది. విదేశాల్లో ఎక్కువ కాలం గడిపి తిరిగి వచ్చే వలసదారులు కస్టమ్స్, బార్డర్ అధికారుల ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
వలసదారులు స్వదేశీ పాస్‌పోర్ట్‌తో పాటు గ్రీన్‌కార్డు, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఉద్యోగ ధ్రువీకరణ పత్రం, ట్యాక్స్ చెల్లింపు రసీదులు, వేతన స్లిప్పులు వంటి పత్రాలను వెంట తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులైతే కళాశాల లేదా యూనివర్సిటీ అనుమతి పత్రాలు, యూఎస్ బ్యాంకు ఖాతా వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.