Black Beans: రెగ్యులర్ గా తిని ఆహార పదార్థాలతో పాటు ఇతర తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు శక్తిని ఇచ్చిన వారవుతాం. అయితే వీటిలో నల్ల శనగల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవి గ్రామాల్లో విరివిగా దొరుకుతూ ఉంటాయి. పట్టణాలు, నగరాల్లో కూడా కిరాణా షాపుల్లో సహా అందుబాటులో ఉంటాయి. కానీ చాలామంది వీటిని పట్టించుకోరు. వీటి గురించి తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టారు. నల్ల శనగలను నానబెట్టి లేదా వేయించి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ఇవి ఆరోగ్యమే. అయితే వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతిరోజు ఉదయం పరిగడుపున గుప్పెడు నల్ల శనిగలను తినడం వల్ల శరీరానికి రోజంతా శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఒకేసారి శక్తిని ఇవ్వకుండా అవసరమైనప్పుడు శక్తిని విడుదల చేస్తాయి. అందువల్ల వీటిని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది.
నల్ల శనగల్లో విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పరువు ఉన్న వారిలో కొలెస్ట్రాల్ కలిగిస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు నల్ల శనిగలను తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. అయితే నల్ల శనగలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ క్రియ సమస్య ఉంటుంది. కానీ వీటిని నీటిలో నానబెట్టి మితంగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సమస్య నుంచి బయటపడతారు. గుండెజబ్బుతో బాధపడేవారు నల్ల శనిగలను ప్రతిరోజు కొన్ని తింటూ ఉండాలి. అలాగే కడుపు ఉబ్బరం ఉన్నవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు..
నల్ల శనిగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా మారుతాయి. నల్ల శనిగల్లో గ్లైసమిక్ స్థాయి తక్కువగా ఉంటుంది. దీంతో ఇవి నిదానంగా జీర్ణక్రియ జరిగి చక్కెర స్థాయి నిల్వలను పెరగకుండా కాపాడుతాయి. నానబెట్టిన నల్ల శనగల కంటే మొలకెత్తినవి తినడం వల్ల మరింత ప్రయోజనాలు పొందవచ్చు. దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు రాలకుండా ఉండాలంటే నల్ల శనిగలను రెగ్యులర్గా తీసుకోవాలని అంటున్నారు.
అయితే నల్ల శనిగలను నానబెట్టి తినేందుకు ఇష్టపడని వారు వీటిని వేయించుకొని కూడా తినవచ్చు. అలాగే నూనెలో ప్రాసెస్ చేసి తినడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. ఎలాగైనా ఈ నల్ల శనిగలను రెగ్యులర్గా తీసుకునే ప్రయత్నం చేయాలి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్, ఇతర ఆహార పదార్థాల కన్నా ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా వీటి ద్వారా కూడా తక్కువగానే ఉండడం వల్ల.. వీటిని తినే అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఎదిగే పిల్ల కోసం నల్ల శనగలను ఇవ్వడం వల్ల ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. పిల్లల్లో కాల్షియంతో పాటు మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద అందించాలి. అలాగే సాయంత్రం స్నాక్స్ కింద కూడా అందించి వారి ఆరోగ్యానికి పాటుపడాలి.