America Election Result 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవైపు పోలింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ జోరు చూపిస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఫలితాలు ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. తది వరకు అదే ట్రెండు కొనసాగితే శ్వేత సౌధంలో ఆయన అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 స్వింగ్ రాష్ట్రాలలో ట్రంప్ పై చేయి ప్రదర్శిస్తున్నారు. నార్త్ కరోలినా రాష్ట్రంలో ట్రంప్ విజయం సాధించారు. ఇక్కడ లీడ్ కనుక దక్కితే ట్రంప్ మరో మాటకు తావులేకుండా అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు 247 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ లీడ్ కొనసాగిస్తున్నారు. అయితే కమలా హారీస్ కూడా ప్రత్యర్థి ముందు మోకరిల్లడం లేదు. ఆమె కూడా 210 ఎలక్టోరల్ ఓట్లను సొంతం చేసుకున్నారు..
ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు ఇవే..
ఇప్పటివరకు ట్రంప్ మెంటానా, మిస్సోరి, టెక్సాస్, నెబ్రాస్కా(ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ 3), ఒహియో, వ్యూమింగ్, సౌత్ డకోటా, నార్త్ డకోటా, లూసియానా, ఆర్కాన్సస్, ఇండియానా, ఫ్లోరిడా, వెస్ట్ వర్జినియా, సౌత్ కరోలినా, కెంటకి, ఒక్లోహమా, టేనాన్సి, అలబామా, మిస్సిసిపి రాష్ట్రాలలో విజయం సాధించారు.
కమల విజయం సాధించిన రాష్ట్రాలు ఇవే..
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, న్యూయార్క్, కొలరాడో, ఇల్లి నాయిస్, డెలా వెర్, వేర్మోంట్, మేరీ ల్యాండ్, న్యూ జెర్సీ, రోడ్ ఐలాండ్, మసాచు సెట్స్, కనెక్టికట్ రాష్ట్రాలలో విజయం సాధించారు.
యువతరం ఎటువైపంటే..
యువ ఓటర్లు ఈసారి ట్రంప్ వైపు ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 30 సంవత్సరాల లోపు ఓటర్లు పదిమందిలో ముగ్గురు ట్రంప్ నకు జై కొట్టారు. ఇక ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇక మోంటానా రాష్ట్రంలో ట్రంప్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. కమలా హరీస్ న్యూయార్క్ లో 70% కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. కెమెరా వైపు అమెరికన్ సేనేటర్ గా తొలిసారి కొరియన్ ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ ఆండీ కిమ్ న్యూ జెర్సీ సెనెట్ రేస్ లో విజయం సాధించారు. అతడు కొరియన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈ ప్రకారం తొలి కొరియన్ అమెరికన్ సేనేటర్ గా ఆవిర్భవించాడు. ఇక ఒక్లాహామా ప్రాంతంలో రిపబ్లికన్ అభ్యర్థి టామ్ కోల్ తిరిగి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అతడు డెమోక్రటిక్ అభ్యర్థి మేరీ బ్రాన్నన్ ను ఓడించారు. ఇంకా ఫ్లోరిడా రాష్ట్రంలో రిపబ్లికన్ అభ్యర్థి అన్నా పౌలినా లూనా తిరిగి విజయం సాధించారు. లూనా ట్రంప్ కు మొదటినుంచి గట్టి మద్దతు ఇస్తున్నారు. ఆయన విజయంతో ట్రంప్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది అత్యంత ఆనందం కలిగించే విషయమని పేర్కొన్నారు.