Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో తన స్నేహితుడు, వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి కి మద్దతుగా అతని ఇంటికి వెళ్లి సపోర్టు తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరోజు 144 సెక్షన్ అమలు లో ఉన్నప్పటికీ , ఎలాంటి నిబంధనలను పాటించకుండా, జనసమీకరణ చేసినందుకు అల్లు అర్జున్ పై కంప్లైంట్ నమోదు అయ్యింది. దీంతో అల్లు అర్జున్ తాను ఎలాంటి నిబంధనలను ఉల్లగించలేదని, దయచేసి నా కేసు కొట్టివేయాల్సిందిగా ఇటీవలే అమరావతి హై కోర్టు కి వెళ్లి ఆయన క్వాష్ పిటీషన్ దరఖాస్తు చేసాడు. కోర్టు ఈ పిటీషన్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అల్లు అర్జున్ పై నమోదైన ఆ కేసు ని కొట్టివేస్తూ ఉత్తర్వులు కాసేపటి క్రితమే జారీ చేసింది. వ్యక్తిగత పర్యటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రిందకు రాదని అల్లు అర్జున్ తరుపున న్యాయవాదులు సమర్థవతంగా వాదించడంతో, జడ్జి కూడా దానికి ఏకీభవించి క్వాష్ పిటీషన్ కి ఆమోదం తెలిపారు.
దీంతో అల్లు అర్జున్ కి, ఆయన అభిమానులకు కాస్త ఊరట లభించింది. మరో నెల రోజుల్లో ‘పుష్ప 2’ రిలీజ్ అవుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి కేసుల్లో మా అభిమాన హీరో చిక్కుకున్నాడు అంటూ బాధపడుతున్న ఆయన అభిమానులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి కి సపోర్టు చేసిన రోజు నుండి ఆయన మీద పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ స్థాయి ట్రోల్స్ వేసారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆ ట్రోల్స్ కి ధీటుగా సమాధానం చెప్పారు. అలా ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ కి పాజిటివ్ గా ఒక ఘటన జరగడం పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.
ఇదంతా పక్కన పెడితే మరో వారం రోజుల్లో పుష్ప 2 ప్రొమోషన్స్ ని భారీ లెవెల్ లో ప్రారంభించనున్నారు మేకర్స్. అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పర్యటించి భారీ ఈవెంట్స్ ని ఈ సినిమా కోసం ప్లాన్ చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఘనంగా చేయనున్నారు. హైదరాబాద్ లో ఒక ఈవెంట్, అదే విధంగా తిరుపతి/ అమరావతి లో మరో ఈవెంట్ ని ప్లాన్ చేసారు మేకర్స్. ఆంధ్ర లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా పాల్గొంటారని తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని సంప్రదించారని, ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయ్యేందుకు సుముఖత చూపించాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి ని పూర్తి వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది.