https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఓటింగ్ లో నిఖిల్ ని భారీ మార్జిన్ తో దాటేసిన గౌతమ్..డేంజర్ జోన్ లో ఆ నలుగురు..యష్మీ అవుట్?

గడిచిన 5 వారాల నుండి నబీల్ నామినేషన్స్ లోకి రాకపోవడంతో పాటు, అతని ఆట లో ఫైర్ బాగా తగ్గడంతో ఓటింగ్ పడిపోయింది. ఆయన స్థానంలోకి ప్రేరణ టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చి నిఖిల్ కి గట్టి పోటీని ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్ ఇప్పుడు నిఖిల్ ని దాటేసి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 1:25 pm
    Bigg Boss Telugu 8

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8:  ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో చెప్పడానికి చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే హౌస్ లో జరిగే టాస్కులను బట్టి రోజు రోజుకి కంటెస్టెంట్స్ గ్రాఫ్స్ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు వరకు కూడా నిఖిల్, నబీల్ కి మధ్య టైటిల్ రేస్ ఉండేది. వీళ్లిద్దరు నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా ఓటింగ్స్ నువ్వా నేనా అనే రేంజ్ లో ఉండేవి. కానీ గడిచిన 5 వారాల నుండి నబీల్ నామినేషన్స్ లోకి రాకపోవడంతో పాటు, అతని ఆట లో ఫైర్ బాగా తగ్గడంతో ఓటింగ్ పడిపోయింది. ఆయన స్థానంలోకి ప్రేరణ టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చి నిఖిల్ కి గట్టి పోటీని ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్ ఇప్పుడు నిఖిల్ ని దాటేసి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.

    కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ ని జనాలకు చూపించడంలో, వాళ్ళని ధీటుగా ఎదురుకోవడంలో గౌతమ్ సక్సెస్ అవ్వడంతో, అందరూ ఆయనకీ ముక్తకంఠం తో సపోర్టు చేస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ లాగ గ్రూప్ గేమ్స్ ఆడకుండా, సోలో గా గేమ్ ఆడుతున్న గౌతమ్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆయన, అన్ని పోల్స్ లోనూ టాప్ స్థానంలో కొనసాగుతుండగా, నిఖిల్ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు. కేవలం యూట్యూబ్ పోల్స్ లో మాత్రమే నిఖిల్ మొదటి స్థానంలో, గౌతమ్ రెండవ స్థానం లో కొనసాగుతుండగా, మిగిలిన అన్ని చోట్ల గౌతమ్ భారీ మార్జిన్ తో ఓటింగ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ప్రేరణ మూడవ స్థానంలో కొనసాగుతుంది.

    ఇదంతా పక్కన పెడితే నామినేషన్స్ లోకి వచ్చిన మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ (యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ) డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నలుగురికి సరిసమానమైన ఓటింగ్ పడుతుంది. యష్మీ కి వరుసగా నెగటివ్ ఎపిసోడ్స్ పడడంతో, ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కానీ ఈరోజు యష్మీ, విష్ణు ప్రియ కి మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడనుంది. మెగా చీఫ్ కంటెండర్స్ టాస్కులలో వీళ్లిద్దరు చాలా బలంగా ఆడారు. కాసేపటి క్రితం విడుదలైన నేటి ఎపిసోడ్ మొదటి ప్రోమో లో విష్ణు ప్రియ, పృథ్వీ పోటీ పడడం మనమంతా చూసాము కదా, ఈ టాస్కులో పృథ్వీ గెలుస్తాడు, కానీ విష్ణు పృథ్వీ తో సమానంగా పోటీ పడి తన సత్తా చాటింది. ఇది ఆమెకి బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా యష్మీ కూడా ఒక టాస్కులో గెలిచి మెగా చీఫ్ కంటెండర్స్ లో ఒకరుగా నిల్చింది. కాబట్టి వీళ్లిద్దరు ఓటింగ్ లో ముందుకెళ్లి, పృథ్వీ, హరితేజ డేంజర్ జోన్ లో పడే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది.