Homeఅంతర్జాతీయంDonald Trump: దారుణంగా పడిపోయిన ట్రంప్‌ రేటింగ్‌.. చరిత్రలోనే అత్యల్పం

Donald Trump: దారుణంగా పడిపోయిన ట్రంప్‌ రేటింగ్‌.. చరిత్రలోనే అత్యల్పం

Donald Trump: ఇరాన్‌ యుద్దం ఎందుకు మొదలు పెట్టాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియడం లేదు. యుద్ధం మొదలు పెట్టిననాటి అంచనాలను ఇరాన్‌ తలకిందులు చేసింది. ఇప్పుడు యుద్ధం కొనసాగించలేక.. యుద్ధం నుంచి నిష్క్రమించలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ఏ అధ్యక్షుడు మూటగట్టుకోనంత అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాడు. ఆయనకు ప్రజామోదం దారుణంగా తగ్గుతోంది. యుద్ధ చర్యల విషయంలో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ప్రజల్లో […]

Donald Trump: ఇరాన్‌ యుద్దం ఎందుకు మొదలు పెట్టాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియడం లేదు. యుద్ధం మొదలు పెట్టిననాటి అంచనాలను ఇరాన్‌ తలకిందులు చేసింది. ఇప్పుడు యుద్ధం కొనసాగించలేక.. యుద్ధం నుంచి నిష్క్రమించలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ఏ అధ్యక్షుడు మూటగట్టుకోనంత అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాడు. ఆయనకు ప్రజామోదం దారుణంగా తగ్గుతోంది. యుద్ధ చర్యల విషయంలో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఏపీ–ఎన్‌ఓఆర్‌సీ(అసోసియేటెడ్‌ ప్రెస్‌–నార్క్‌) పోల్‌ ప్రకారం, ట్రంప్‌ నెట్‌ అప్రూవల్‌ రేటింగ్‌ –17 శాతానికి పడిపోయింది. అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడికీ ఇంత తక్కువ రేటింగ్‌ రాలేదని సర్వే వెల్లడించింది.

దారుణంగా రేటింగ్‌ పతనం..
ట్రంప్‌ ప్రజామోదం కేవలం తగ్గడమే కాదు, కూలిపోయింది. ప్రధాన పార్టీల మద్దతులోనూ భారీ క్షీణత కనిపిస్తోంది. రిపబ్లికన్ల మద్దతు గతంలో 92 శాతం ఉండగా 84 శాతానికి పడిపోయింది. డెమోక్రాట్ల మద్దతు గతంలో 5 శాతం ఉండగా ఇప్పుడు అంతే ఉంది. స్వతంత్ర ఓటర్ల మద్దతు గతంలో 45 శాతం ఉండగా ప్రస్తుతం 32 శాతానికి పడిపోయింది. మొత్తంగా అప్రూవల్‌ రేటు + 10 శాతం నుంచి – 17 శాతానికి పడిపోయింది.

ట్రంప్‌ మోనార్క్‌ శైలి కారణంగానే..
ట్రంప్‌ రేటింగ్‌ పతనానికి ప్రధాన కారణం ఇరాన్‌పై ఆయన తీసుకుంటున్న యుద్ధ చర్యలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ను, మిత్రులను సంప్రదించకుండా ట్రంప్‌ ఒంటరిగా యుద్ధ నిర్ణయాలు తీసుకోవడం ‘మోనార్క్‌లా వ్యవహరించడంగా ప్రజలు భావిస్తున్నారు. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణ మరింత విస్తరించి, అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతారనే ఆందోళన ప్రజల్లో ఉంది. యుద్ధం కారణంగా పెట్రోల్‌ ధరలు, నిత్యావసరాల ధరలు పెరగడం సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ప్రపంచ దేశాలు అమెరికా యుద్ధ చర్యలను తీవ్రంగా విమర్శించడం, దీనికి ట్రంప్‌ సరైన సమాధానం ఇవ్వకపోవడం ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ట్రంప్‌ చెత్త రికార్డు..
ట్రంప్‌ రేటింగ్‌ –17 శాతానికి చేరడం అమెరికా చరిత్రలోనే ఒక రికార్డు. గతంలో జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ –12 శాతం రేటింగ్‌ నమోదైంది. 2008లో ఇరాక్‌ యుద్ధ సమయంలో ఈ వ్యతిరేకత వచ్చింది. హ్యారీ ట్రూమన్‌ 1952లో – 22 శాతం రేటింగ్‌ నమోదైంది. నాటి ఆర్థిక సంక్షోభం కారణంగా రేటింగ్‌ పడిపోయింది. లిండన్‌ జాన్సన్‌ రేటింగ్‌ 1968లో వియత్నాంతో యుద్ధం కారణంగా – 20 శాతానికి పడిపోయింది. ఆధునిక పోలింగ్‌ పద్ధతుల్లో ట్రంప్‌ రేటింగ్‌ చరిత్రలోనే అత్యల్పం అని సర్వే సంస్థ తెలిపింది.

అధ్యక్షుడికి డేంజర్‌ బెల్‌..
ట్రంప్‌కు అత్యంత భరోసా ఇచ్చే రిపబ్లికన్‌ పార్టీ మద్దతు కూడా 92% నుంచి 84%కు పడిపోవడం ఆయన శిబిరాన్ని కలవరపెడుతోంది.యుద్ధ విస్తరణ, ఆర్థిక భారంపై రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువ రిపబ్లికన్లు సోషల్‌ మీడియాలో ట్రంప్‌ యుద్ధ నయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2026 మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ఇది పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉంది. డెమోక్రాట్లు హౌజ్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్, సెనేట్‌లో మెజారిటీ సాధించే అవకాశం పెరిగింది. పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్‌ వంటి కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థులు వెనుకబడే ప్రమాదం పెరిగింది. ట్రంప్‌ మళ్లీ పోటీ చేస్తే ఈ రేటింగ్‌ ఆయనకు పెద్ద అడ్డంకిగా మారవచ్చు.

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజామోదం –17 శాతానికి చేరడం కేవలం సంఖ్యల ఆట కాదు, ఇది అమెరికా ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక. ఇరాన్‌ యుద్ధం విషయంలో మోనార్క్‌ లాగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకపోవడం ట్రంప్‌కు భారీ రాజకీయ నష్టం తెచ్చిపెట్టింది. రిపబ్లికన్ల మద్దతు కూడా క్షీణించడం, 2026 మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే రాజు అనే సత్యాన్ని ట్రంప్‌ మర్చిపోకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper