https://oktelugu.com/

Three Capitals: ప్రపంచంలో ఏ దేశానికి మూడు రాజధానులు ఉన్నాయో మీకు తెలుసా?

ఓ దేశానికి మూడు రాజధానులు ఉన్నాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇంతకీ ఆ దేశం ఏది? ప్రపంచంలో అన్ని దేశాలకు కేవలం ఒక్క రాజధానే ఉందా? లేకపోతే ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉన్నాయా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 14, 2024 / 12:04 AM IST

    South africa

    Follow us on

    Three Capitals: సాధారణంగా దేశానికి కేవలం ఒక రాజధాని మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఓ దేశానికి మాత్రం మూడు రాజధానులు ఉన్నాయి. 2014లో తెలంగాణతో విడిపోయన తర్వాత ఆంధ్రపదేశ్‌కు ఇప్పటి వరకు రాజధాని లేదు. గత ప్రభుత్వం సమయంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. కానీ దీనికి ఎవరూ అంగీకరించలేదు. ఇప్పుడు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం అమరావతినే రాజధానిగా ప్రకటించింది. అయితే ఏపీలోనే మొదటిగా ఇది పెట్టలేదు. ఇంతకు ముందు ఓ దేశానికి మూడు రాజధానులు ఉన్నాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇంతకీ ఆ దేశం ఏది? ప్రపంచంలో అన్ని దేశాలకు కేవలం ఒక్క రాజధానే ఉందా? లేకపోతే ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉన్నాయా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఈ ప్రపంచంలో కేవలం ఒకే దేశానికి మూడు రాజధానులు ఉన్నాయి. అదే దక్షిణాఫ్రికా దేశం. పరిపాలనా కార్యనిర్వాహక రాజధానిగా ప్రిటోరియా, కేప్ టౌన్‌ శాసన సభ రాజధానిగా, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా బ్లూమ్‌ ఫోంటెయిన్ అనే మూడు రాజధానులు ఈ దేశానికి ఉన్నాయి. ప్రిటోరియా పరిపాలనా రాజధాని కావడంతో ఇక్కడ అధ్యక్షుడు, ప్రభుత్వ విభాగాలు అన్ని ఉంటాయి. కేప్ టౌన్ నైరుతి తీరంలో ఉంటుంది. ఇది పార్లమెంటుకు నిలయం. ఇక దేశం మధ్యలో ఉన్న బ్లూమ్‌ఫోంటెయిన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అప్పీలకు ఆతిథ్యం ఇస్తోంది. దేశవ్యాప్తంగా అధికార సమతుల్యత వల్ల దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులకు ఆమోదం తెలిపిన్లు తెలుస్తోంది. ప్రపంచంలోని పెద్ద ఖండాల్లో దక్షిణాఫ్రికా దేశం రెండోది. ఈ దేశం తన అభివృద్ధిని ఎప్పటికప్పుడూ పెంచుకుంటోంది. ఈ దేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆఫ్రికాలో దేశాల్లో దక్షిణాఫ్రికానే అత్యంత ధనిక దేశం. దేశంలో కొన్ని నగరాలు అయితే చాలా రిచ్‌గానే ఉంటాయి.

    దక్షిణాఫ్రికాలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ దేశంలో మొత్తం 12 అధికారిక భాషలు ఉన్నాయి. సెపెడి, సెసోతో, సెట్స్వానా, సిస్వాతి, షివెండా, జిట్సోంగా, ఆఫ్రికాన్స్, ఇంగ్లీషు, ఇసిఎన్‌డెబెలె, ఇసిక్షోసా, ఇసిజులతో పాటు సాస్‌ల్‌లు అధికార భాషలే. చాలా మంది దక్షిణాఫ్రికా ప్రజలు కనీసం రెండు భాషలను మాట్లాడతారు. ఇది ప్రపంచంలోని ఎక్కువ భాషల్లో ఒకటిగా నిలిచింది. దేశం ఆర్థిక వ్యవస్థ ఫైనాన్స్, టెక్నాలజీ, తయారీ వంటి పరిశ్రమల్లోకి ముందుకు దూసుకుపోతుంది. అలాగే ఇక్కడ జోహన్నెస్‌బర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రపంచంలోనే అతిపెద్దది. దేశంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంది. రోజురోజుకీ దేశం ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతూనే వస్తుంది. ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడుతోంది.