https://oktelugu.com/

Astronauts: అంతరిక్షంలో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలు.. ఆశ్చర్యపరుస్తున్న వీరి సాహసం

రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలు గడిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా.. తన వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూ బియో 371 రోజులపాటు అంతరిక్షంలో గడిపినట్టు ప్రకటించింది.

Written By:
  • Rocky
  • , Updated On : September 28, 2023 / 11:51 AM IST

    Astronauts

    Follow us on

    Astronauts: ఒక నిమిషం గాలి లేకుండా మనం బతకడం అసాధ్యం. ఒక పూట నీళ్లు తాగకుండా మన జీవించడం కష్ట సాధ్యం. ఆహారం లేకుండా కొన్ని రోజులపాటు అలా ఉండడం అత్యంత సంక్లిష్టం. అలాంటిది ఈ భూమి మీద కాకుండా.. గాలి ఆలవాలం లేని.. గురుత్వాకర్షణ మచ్చుకు కూడా కనిపించని ప్రాంతంలో ఏకంగా వీరు ఏడాదికి మించి ఉన్నారు. అక్కడి వాతావరణం లో, అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య జీవించారు. సరిగ్గా ఏడాది తర్వాత భూమి మీదకు వచ్చారు. మనుషులు సాధించలేనిది ఏదీ లేదని మరొకసారి నిరూపించారు. ఇంతకీ వారు ఎవరు? అంతరిక్షంలోకి వారు ఎందుకు వెళ్లారు? ఏడాది పాటు అక్కడ వారు ఏం పరిశీలించారు?

    రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలు గడిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా.. తన వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూ బియో 371 రోజులపాటు అంతరిక్షంలో గడిపినట్టు ప్రకటించింది. వాస్తవానికి వీరు ఆరు నెలల క్రితమే భూమిపైకి చేరుకోవాల్సి ఉంది. చిన్న ఉల్క తాకిడికి స్పేస్ క్రాఫ్ట్ లో లీక్ చోటుచేసుకుంది. దీనివల్ల వారు భూమికి చేరుకోవడం సాధ్యపడలేదు. ఈ క్రమంలో సిబ్బంది అనేవారు లేకుండా రష్యా అంతరిక్ష కేంద్రం మాస్కో నుంచి రాకెట్ ను నింగి లోకి పంపింది. దీంతో ఆ ముగ్గురు వ్యోమగాములు తిరుగు ప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 27 నాడు భూమి మీదకు చేరుకొని కజకిస్తాన్ లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. అంతరిక్షంలో వాతావరణం, అక్కడ ఆక్సిజన్ నిల్వలు ఎలా ఉన్నాయి, ఒకవేళ ఉల్కా పాతం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ కృత్రిమంగా గురుత్వాకర్షణ శక్తిని సృష్టించడం సాధ్యమేనా? అనే విషయాల మీద వారు పరిశోధనలు సాగించారు. అయితే తమ పరిశోధనలు మరిన్ని సాగే విధంగా అక్కడి మట్టిని వారు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రయోగం రష్యా, అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతోంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు వేరువేరుగా ఈ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి.

    ” మా వ్యోమగాములు ఏడాది పాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడ అనేక రకాల ప్రయోగాలకు ఎలాంటి వాతావరణంలో పరిశీలించారు. దుర్భేద్యమైన వాతావరణం ఉన్నప్పటికీ వారు ముందుకే సాగారు. వారి ఆత్మవిశ్వాసం ముందు ప్రతికూల పరిస్థితులు కూడా చిన్న పోయాయి. ఏకంగా వారు ఏడాది పాటు అంతరిక్షంలో ఉన్నారంటే మామూలు విషయం కాదు” అని అటు రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థలు ట్విట్టర్లో రాసుకొచ్చాయి. కాకపోతే ఈ రెండు దేశాల అంతరిక్ష సంస్థలకు సంబంధించిన ప్రకటనలో పెద్దగా సారూప్యత లేకపోవడంతో .. సంయుక్తంగా ఈ ప్రయోగాలు చేశాయని తెలుస్తోంది. ఏడాది క్రితం రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించింది. అయితే అంతకుముందే ఈ ప్రయోగం జరిగిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ యుద్దం తర్వాత ఈ ప్రయోగం జరిగి ఉంటుందని వ్యాఖ్యానాలను వారు ఖండిస్తున్నారు.