Pakistan unemployment crisis: దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టు ఆడుతోంది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ నుంచి అప్పులు తెచ్చుకుంటేగాని రోజు గడవని పరిస్థితి. మరోవైపు పాకిస్తాన్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఉగ్రవాదం పెంచి పోషించడంతో ప్రముఖ కంపెనీలు ఆ దేశాన్ని వీడుతున్నాయి. గతేడాది అనేక సంస్థలు పాకిస్తాన్ను వీడాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏమో కానీ, యువకులకు ప్రైవేటు ఉద్యోగాలు దొరకడం లేదు. తాజా అధ్యయనాలు దేశంలో నిరుద్యోగ రేటు రికార్డుస్థాయికి చేరుకుంది.
రికార్డు స్థాయి నిరుద్యోగం..
లేబర్ ఫోర్స్ సర్వే ఫలితాల ప్రకారం, నిరుద్యోగ శాతం పాకిస్తాన్లో 7.1కి చేరింది. గత రెండు దశాబ్దాల్లో ఇది అత్యధికం. ఏటా 30 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు సృష్టించాల్సి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరించారు. రాబోయే 10 సంవత్సరాల్లో 3 కోట్ల ఉద్యోగాల అవసరం ఉందని అంచనా.
యువత విదేశాలబాట
అస్థిర రాజకీయాలు, భద్రతా ఆందోళనలతో నైపుణ్యం ఉన్న విద్యావంతులు దేశం వీడుతున్నారు. విదేశాలకు వెళ్తున్నారు. 2025లో 4 వేల మంది వైద్యులు దేశాన్ని వదిలిపోయారు. ఇతర వృత్తిధారులు కూడా ఇదే పరిస్థితి. పరిశ్రమలు మూతలు, పెట్టుబడుల ఉపశమనం సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.
షెహబాజ్ ప్రభుత్వం ఆర్థిక మార్పులు సాధించామని ప్రకటిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఉద్యోగాలు లేకపోవడం, పరిశ్రమల తగ్గుదల నిరుద్యోగ సమస్యను పెంచుతోంది. ఉగ్రవాద దాడులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయి.