China Workers
China : కోవిడ్ ప్రబలినప్పుడు చైనాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసేది కాదు. ప్రపంచం మొత్తం కోవిడ్ తగ్గినప్పటికీ.. అక్కడ లాక్ డౌన్ విధించడం ఆపలేదు. షాంగై నుంచి మొదలుపెడితే బీజింగ్ వరకు లాక్ డౌన్ విధించారు. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారు. అయినా కూడా అక్కడ ఏం జరుగుతుందో రెండవ కంటికి తెలియదు. ఎందుకంటే చైనాలో నియంతృత్వం అనేది సర్వసాధారణం. పైగా ఆ దేశాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం పరిపాలిస్తోంది.
చైనా దేశాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి అక్కడ హక్కులు అనేవి ఉండవు. ప్రజాస్వామ్యం అనే పదం వినపడదు. స్వేచ్ఛ అనే మాటకు అర్థం లేదు. ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలి. అక్కడి నిబంధనలోనే పాటించాలి. అంటే తప్ప మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం.. ఇది మా జీవితం అంటే కుదరదు. పైగా అక్కడి కార్మిక చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పని విషయంలో ఏమాత్రం రాజీపడరు. పైగా గొడ్డు చాకిరీ చేయిస్తుంటారు. కోవిడ్ సమయంలో ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టి చైనా ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలైంది. ఆఖరికి ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకున్నప్పటికీ చైనా విధానాల్లో మార్పు రాలేదు. పైగా సంవత్సరాలకు సంవత్సరాలు లాక్ డౌన్ విధించి ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారు. ఆహారం, పాలు, నిత్యవసరల వంటివి సరఫరా చేయకుండా ఏడిపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా ప్రభుత్వం దురాఘతాలు ఒక పట్టాన మింగుడు పడవు. అందుకే చైనా అంటేనే నిలువెత్తు రాక్షసత్వానికి ప్రతీక అని యూరప్ దేశాలు అంటుంటాయి.
ఇక కార్మికులతో పని చేయించుకునే విషయంలో చైనాను మించిన దేశం మరొకటి ఉండదు. పైగా అక్కడ పని గంటల విషయంలోనూ విచిత్రమైన నిబంధనలు అమలవుతుంటాయి. అనారోగ్యానికి గురైనా, కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నా.. సెలవు పెట్టడానికి ఉండదు. చచ్చినట్టు పని చేయాల్సిందే. ఇలా తూర్పు చైనాలో పెయింటర్ పనిచేస్తున్న 30 సంవత్సరాల ఆ బావో అనే వ్యక్తి ఏకధాటిగా 104 రోజుల పని చేశాడు. ఇందులో ఒకరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు. దీంతో అతడు న్యూ మెకానికల్ ఇన్ఫెక్షన్ వ్యాధికి గురయ్యాడు. దానివల్ల అతడి అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో అబావో కన్నుమూశాడు. అయితే అతడి మరణానికి సంబంధించి యాజమాన్యంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. వాదోపవాదాలు విన్న కోర్టు అతనితో ఆ పని చేయించిన యాజమాన్యానికి దిమ్మ తిరిగిపోయే తీర్పు ఇచ్చింది. అబావో కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అబావో మరణానికి 20% యజమాని కారణమని పేర్కొంది. అదే తూర్పు చైనాలో అబావో మాత్రమే కాదు.. చాలామంది ఇదేవిధంగా పనిచేస్తున్నారు. ధరలు పెరిగిపోవడం.. ఉపాధి లేకపోవడం.. జీవన ప్రమాణాలు తగ్గిపోవడం.. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో చాలామంది ఇలానే సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు. చివరికి తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.. అబావో ఉదంతాన్ని వెస్ట్రన్ మీడియా ప్రధానంగా ప్రసారం చేస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: This is an incident that shows the plight of workers in china
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com