Homeఎంటర్టైన్మెంట్Tamannaah Bhatia: విజయ్ వర్మ కంటే ముందు ఆ ఇద్దరితో ఎఫైర్ నడిపాను... తమన్నా ఓపెన్...

Tamannaah Bhatia: విజయ్ వర్మ కంటే ముందు ఆ ఇద్దరితో ఎఫైర్ నడిపాను… తమన్నా ఓపెన్ కామెంట్స్!

Tamannaah Bhatia: టాలీవుడ్ వేదికగా స్టార్ హీరోయిన్ ఫేమ్ తెచ్చుకుంది తమన్నా భాటియా. హ్యాపీ డేస్, 100% లవ్ చిత్రాలు తమన్నాకు బ్రేక్ ఇచ్చాయి. అనంతరం టాప్ హీరోల సరసన వరుస చిత్రాలు చేసింది. తెలుగు, తమిళంలో అధికంగా తమన్నా చిత్రాలు చేసింది. అలాగే బాలీవుడ్ లో సైతం ఒకింత సక్సెస్ అయ్యింది. రెండు దశాబ్దాలుగా తమన్నా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతుంది. కాగా ప్రస్తుతం తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది.

2023 న్యూ ఇయర్ వేడుకలు ఈ జంట కలిసి జరుపుకున్నారు. దాంతో ఎఫైర్ రూమర్స్ వెలువడ్డాయి. మొదట్లో ఈ వార్తలను తమన్నా ఖండించారు. అనంతరం తాము డేటింగ్ చేస్తున్న మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. యాంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2లో సమంత-విజయ్ వర్మ నటించారు. సదరు సిరీస్ షూటింగ్ లో వీరు ప్రేమలో పడ్డారట. విజయ్ వర్మ నాకు తోడుగా, రక్షణగా ఉంటాడనే నమ్మకం కలిగింది. అందుకే అతన్ని ప్రేమించాను, అని తమన్నా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

ఓపెన్ అయ్యాక తమన్నా-విజయ్ వర్మ కలిసి విహరిస్తున్నారు. విందులు, వినోదాలు చేసుకుంటున్నారు. కాగా తమన్నా గతంలో ఓ ఇద్దరు వ్యక్తులను ప్రేమించిందట. వారితో డేటింగ్ చేసిందట. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఈ మేరకు కామెంట్స్ చేసింది. తమన్నా మాట్లాడుతూ.. టీనేజ్ లో నేను ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. అయితే అతడు నా లక్ష్యానికి అడ్డుగా వచ్చాడు. దాంతో అతనికి బ్రేకప్ చెప్పాను.

అనంతరం మరొక వ్యక్తిని ప్రేమించాను. అబద్దాలతో ఆ బంధం కొనసాగించలేనని తెలుసుకున్నాను. ఈ కారణంగా అతడితో విడిపోయాను. విజయ్ వర్మ కంటే ముందు రెండుసార్లు నా గుండె బద్దలు అయ్యింది… అన్నారు. కాగా గతంలో హీరో కార్తీ తో తమన్నా ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. తమన్నా-కార్తీ ఆవారా చిత్రంలో జంటగా నటించారు. ఆవారా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. కొన్నాళ్ళు కార్తీతో డేటింగ్ చేసిన తమన్నా… మనస్పర్ధలతో విడిపోయిందని అప్పట్లో టాక్.

ఇక విజయ్ వర్మతో పెళ్లి ఎప్పుడనే విషయం తమన్నా చెప్పడం లేదు అంటుంది. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి తమన్నాకు పెళ్లి ప్రశ్న ఎదురవుతుంది. ఆమె మాత్రం దానికి ఇంకా సమయం ఉందని దాటేస్తుంది. తమన్నాకు ఇప్పటికీ అడపాదడపా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. డిజిటల్ సిరీస్ల మీద ఆమె ఎక్కువ ఫోకస్ పెడుతుంది.

RELATED ARTICLES

Most Popular