Homeఅంతర్జాతీయంAmerica Election Result 2024  : ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు ఇవే.. ఆ విజయం వెనుక...

America Election Result 2024  : ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు ఇవే.. ఆ విజయం వెనుక ఎన్నో నాటకీయ పరిణామాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

America Election Result 2024  : ట్రంప్ తనకు లభించిన ఎలక్టోరల్ ఓట్ల ద్వారా కెంటకి స్థానాన్ని మూడవసారి గెలుచుకున్నారు. 1996లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బిల్ క్లింటన్ ఈ రాష్ట్రంలో గెలిచారు. క్లింటన్ అనంతరం ఇక్కడ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు నిలకడగా విజయాలు సాధిస్తున్నారు.

మొంటానా

ఈ రాష్ట్రంలో ట్రంప్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2020 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రానికి అదనపు కాంగ్రెస్ సీటు లభించింది. ఫలితంగా గతం కంటే రెండు ఎలక్టోరల్ ఓట్లు పొందింది. 19 68 లో జరిగిన ఎన్నికల్లో తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.

నెబ్రాస్కా

ఈ స్థానంలో ట్రంప్ వరుసగా మూడవ విజయాన్ని నమోదు చేశారు. 2016లో 25% ఓట్లతో, 2020లో 19 శాతం ఓట్లతో ఈ స్థానంలో ట్రంప్ గెలిచారు.. చివరిసారిగా ఈ స్థానంలో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి లండన్ బి. జాన్సన్ 1964లో గెలిచారు.

పెన్సిల్వేనియా

పెన్సిల్వేనియా డెమొక్రాట్ లకు కంచుకోట. ఈ రాష్ట్రంలో కమలా హారిస్ ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ మ్యాజిక్ ప్రదర్శించారు.. బలమైన ఈ స్థానాన్ని రిపబ్లికన్ లకు తిరిగి తీసుకొచ్చారు.

జార్జియా

2020లో ఇక్కడ డెమొక్రటిక్ పార్టీ సత్తా చాటింది. అయితే ఈసారి రిపబ్లికన్ పార్టీకి జై కొట్టింది. ఇక్కడి ప్రజలు ట్రంప్ నాయకత్వాన్ని బలపరిచారు.

ఉటా

ఈ స్థానంలో ట్రంప్ ఆరు ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. లెటర్ డే సెయింట్ (LDS) కమ్యూనిటీకి చెందిన కొందరు ట్రంప్ నాయకత్వంపై అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ.. చివరికి ఆయన ఆ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో సఫలీకృతులయ్యారు. ఇక ఈ రాష్ట్రం 1968 నుంచి రిపబ్లికన్ అభ్యర్థులకు నిలకడగా మద్దతు ఇస్తోంది. 1964 లో లిండన్ బి. జాన్సన్ నేతృత్వంలో చివరిసారిగా డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది.

ఉత్తర కరోలినా

ట్రంప్ ఈ రాష్ట్రంలో విజయం సాధించారు. 16 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. 2016, 2020 లోనూ ఇదే స్థాయిలో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. ఈ స్థానంలో ట్రంప్ బలమైన మద్దతు దారు జేడీ వాన్ విజయం సాధించారు.

ఇదాహో

ఈ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ మూడోసారి విజయాన్ని సాధించింది. 1964 లో డెమోక్రటిక్ పార్టీ చివరిసారిగా ఈ స్థానాన్ని దక్కించుకుంది…

కాన్సాస్

1964 నుంచి ఈ స్థానంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు. 2016, 2020, 2024 వరుస ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలవడం విశేషం.

అయోవా

ఈ స్థానంలో రిపబ్లికన్ పార్టీకి ఆరు ఎలక్టోరల్ ఓట్లు లభించాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం స్వింగ్ స్టేట్ గా ఉంది. ఇప్పుడు వరుసగా మూడి ఎన్నికల్లో రిపబ్లికన్ కు జై కొట్టింది. ట్రంప్ అధ్యక్షుడయ్యేందుకు కారణమైంది.. ట్రంప్ కు GOP ఓటర్లు బలమైన మద్దతు ఇచ్చారు.

మిస్సోరి

ఈ ప్రాంతంలో ట్రంప్ కు 10 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఈ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ వరుసగా మూడవ విజయాన్ని నమోదు చేసింది. 2016, 2020, 2024లో డెమోక్రటిక్ అభ్యర్థులపై రిపబ్లికన్ అభ్యర్థులు 15% కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించడం విశేషం.

టెక్సాస్

టెక్సాస్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి 40 ఎలక్టో రల్ ఓట్లు లభించాయి. 2020లో ఆరు శాతం, అంతకుముందు 2016లో 9% ఓట్ల తేడాతో రిపబ్లికన్ పార్టీ ఈ స్థానాన్ని దక్కించుకుంది.

ఒహియో

ఇది కీలకమైన స్వింగ్ రాష్ట్రంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలోనూ రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. 16 ఎలక్టో రల్ ఓట్లు సాధించింది. 2016, 2020 ఎన్నికల్లో ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఈ రాష్ట్రాన్ని రిపబ్లికన్ పార్టీ గెలిచింది. 2008, 2012లో డెమొక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించారు..

వ్యోమింగ్

ఈ రాష్ట్రంలో 2016, 2020లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ప్రతి ఎన్నికల్లో 45% ఓట్ల తేడాతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులను ఓడించారు. ఇక్కడ ట్రంప్ కు మూడు ఎలక్టోరల్ ఓట్లు లభించాయి.

లూసియానా

ఈ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీకి 8 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి. 2016, 2020 లోనూ ఈ రాష్ట్రాన్ని రిపబ్లికన్ పార్టీ గెలిచింది. గత ఎన్నికల్లో 58.5% ఓట్ల తేడాతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలవగా.. ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు.

ఇక ఇదే తీరుగా ఇండియానా లో 11, వెస్ట్ వర్జీనియాలో 4, అల బామా లో 9, ఒక్లాహమా లో ఏడు, దక్షిణ కరోలినా లో 9, మిసిసిపి లో 6, ఫ్లోరిడాలో 30, టేనాన్సి లో 11, ఆర్కాన్సస్ లో 6, ఉత్తర డకోటా మూడు, దక్షిణ డకోటా లో మూడు ఎలక్టో రల్ ఓట్లు ట్రంప్ పార్టీకి లభించాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular