Largest Cities: ప్రపంచంలో జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా పెద్ద దేశాలు వేర్వేరుగా ఉన్నాయి. విస్తీర్ణం పరంగా రష్యా, కెనడా, చైనా, యునైటెడ్ స్టేట్స్ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఇక జనాభా పరంగా చూస్తే ఇండియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు దేశాల్లోనే 1.5 బిలియన్ల కన్నా ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఇలాగే ప్రపంచంలో విస్తీర్ణం పరంగా పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..
లా టుక్..
లా టుక్ నగరం విస్తీర్ణం పరంగా ప్రపంచంలో రెండో దేశమైన కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో ఉంది. ఇది 28,122 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిం ఉంది. ఈ నగరం నదులు, సరస్సులు, వృక్ష సంపదతో అందంగా ఉంటుంది.
షాంఘై..
ప్రపంచంలో రెండో అతిపెద్ద నగరం షాంఘై. ఇది చైనాలో ఉంది. దీని మొత్తం వైశాల్యం 6,541 చదరపు కిలోమీటర్లు. ఇది ముఖ్యమైన ఓడరేవు నగరం. అంతర్జాతీయ ఫైనాన్స్ కేంద్రం.
ఇస్తాంబుల్..
ఇస్తాంబుల్ నగరం… టర్కీలో ఉంది. దీని వైశాల్యం 5,343 చదరపు కిలోమీటర్లు. ఇది ఒక ఖండాంతర నగరం. అందమైన వాస్తు శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.
కరాచీ…
కరాచీ నగరం పాకిస్తాన్‌లో ఉంది. దీని వైశాల్యం 3,527 చదరపు కిలోమీటర్లు. ఇది ఐకానిక్ సైట్‌లు, స్ట్రీట్ మార్కెట్‌లకు ప్రసిద్ధి చెందినది.
మాస్కో..
ఇది ప్రపంచంలో అతిపెద్ద దేశమైన రష్యాలో ఉంది. దీని విస్తీర్ణం 2,561 చదరపు కిలోమీటర్లు. రెడ్ స్వేక్, క్రెమ్లిన్, సెయింట్ బాసిల్ కేథడ్రల్ వంటివి ఇక్కడ ప్రసిద్ధమైనవి.
టోక్కో…
ఇది జపాన్ దేశ రాజధాని నగరం. దీని వైశాల్యం 2,188 చదరపు కిలోమీటర్లు. ఇది భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశం.
ఢిల్లీ..
భారత రాజధాని నగరం ఢిలీ. దీని వైశాల్యం 1,484 చదరపు కిలోమీటర్లు. ఇది రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రం
న్యూయార్క్..
న్యూయార్క్ నగరం ఆసియాలోనే అతిపెద్దది. దీని వైశాల్యం 1,214 చదరపు కిలోమీటర్లు. చాలా అందమైన నగరం ఇది.
కైరో..
ఈజిప్టు రాజధాని నగరం కైరో. దీని విస్తీర్ణం 1,709 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ గిజా పిరమిడ్లు ఉంటాయి.