https://oktelugu.com/

Aadhaar: ఇలా చేస్తే మీ ఆధార్‌ ని ఎవరూ టచ్‌ చెయ్యలేరు…!

ఆధార్‌.. ఇప్పుడు అన్నింటికి ఇదే ఆధారం. మన సమాచారమంతా నిక్షిప్తమై ఉన్న ఈ ఆధార్‌ కార్డు ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారింది. మన ఆధార్‌ను ఉపయోగించి మనకు తెలియకుండానే మన డబ్బులు కాజేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 26, 2024 / 10:41 AM IST

    Aadhaar

    Follow us on

    Aadhaar: ఆధార్‌ పూర్తి భద్రమైనదని కేంద్రం చెబుతోంది. ఆధార్‌లోని వ్యక్తిగత సమాచారం.. వ్యక్తి అనుమతి లేకుండా ఎవరికీ వెళ్లదంటోంది. ఇక సుప్రీం కోర్టు అయితే అన్నింటికీ ఆధార్‌ తప్పనిసకి కాదని తీర్పు చెప్పింది. కానీ, ప్రభుత్వాలు మాత్రం ఆధార్‌ ఉంటేనే పథకాలకు అర్హులు అంటోంది. ఈ క్రమంలో ఆధార్‌లోని వ్యక్తిగత సమాచారం భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఏరపడింది. ప్రైవసీ, గోప్యతకు బయోమెట్రిక్‌ విధానం తీసుకు వచ్చింది. అయితే దానికి మరింత భద్రత కల్పించేలా యూఐడీఏఐ బయోమెట్రిక్‌ లాక్‌ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మనకు తెలియకుండా మన బయోమెట్రిక్‌ను ఎవరూ వినియోగించలేదు. కొంత మంది మన వేలి ముద్రను తస్కరించి.. మన ప్రమేయం లేకుండా చేస్తున్న నేపథ్యంలో ఈ బయోమెట్రిక్‌ లాక్‌ భద్రత కల్పిస్తోంది. దీంతో మీ అనుమతి లేకుండా మీ ఆధార్‌ను ఎవరూ టచ్‌ చేయకుండా బయోమెట్రిక్‌ లాక్‌ భద్రత కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ ను యూఐడీఏఐ చాలా కాలంగా ఆఫర్‌ చేస్తోంది. కానీ చాలా మంది వినియోగించుకోవడం లేదు. ఈ ఫీచర్‌ తో ఒక చిక్కు కూడా ఉంది. ఆధార్‌ బయోమెట్రిక్‌ ఫీచర్, దీనిలో ఉండే ఆ చిక్కు, దానికి తగిన ఉపాయం వంటి అన్ని విషయాలు తెలుసుకుందాం.

    ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ అంటే..
    ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ మన ఆధార్‌ కార్డు బయోమెట్రిక్స్‌ను లాక్‌ లేదా ఆన్‌ లాక్‌ చేయడానికి యూఐడీఏఐ అందించిన ఒక పీచర్‌. ఈ సర్వీస్‌తో యూజర్లు చాలా సులభంగా వారి బయోమెట్రిక్‌ను పాక్షికంగా లాక్‌ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు అన్‌లాక్‌ చేసుకోవచ్చు. ఇది ఆధార్‌ యూజర్‌ ప్రైవసీ, గోప్యతకు బలం చేకూరుస్తుంది.

    ఏ డేటాను లాక్‌ చేయవచ్చు?
    ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌తో ఫింగ్‌ ప్రింట్, ఐరిష్, ఫేస్‌ వంటి బయోమెట్రిక్స్‌ లాక్‌ అవుతాయి. ఈ లాక్‌ను సెట్‌ చేసిన తర్వాత ఆధార్‌ యూజర్‌ అయినా సరే బయోమెట్రిక్‌ ద్వారా ఆధార్‌ అథెంటికేషన్‌ నిర్వహించలేరు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ చేసిన తర్వాత ఆ లాక్‌ తొలగించే వరకూ యూజర్‌ కూడా ఎటువంటి స్కాన్‌ చేయలేరు.

    ఇలా లాక్‌ చేయాలి..
    ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ను ఇలా సెట్‌ చేయవచ్చు. ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. తర్వాత ఆధార్‌ సర్వీస్‌లో కనిపించే ఆధార్‌ లాక్‌/ అన్‌లాక్‌ ట్యాబ్‌ పై క్లిక్‌ చేయాలి. ఇక్కడ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాక్‌ సెట్‌ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంటుంది.

    చిన్న సమస్య..
    ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ ఫీచర్‌ను సెట్‌ చేయడానికి లేదా అన్‌లాక్‌ చేయడానికి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ కచ్చితంగా అవసరం. ఈ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా మాత్రమే ఫీచర్‌ను లాక్‌ లేదా అన్‌లాక్‌ చేసుకునే వీలుంటుంది. మొబైల్‌ నంబర్‌ పోతే.. కొత్త సిమ్‌ కార్డు కోసం ఆధార్‌ అథెంటికేషన్‌ చేయడం కుదరదు. అందుకే ఈ ఫీచర్‌ ఉపయోగించే ముందు అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.

    మొబైల్‌ పోతే…
    ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ ఫీచర్‌ సెట్‌ చేసుకున్న తర్వాత యూజర్‌ మొబైల్‌ పోతే.. దగ్గరలో ఉన్న ప్రధాన ఆధార్‌ కేంద్రాన్ని సంప్రదించాలి. తగిన సలహాలతో అన్‌లాక్‌ చేసుకునే వీలు ఉంటుంది.