Fastest Trains : ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైళ్లు ఇవే..!

ఫ్రాన్స్ లో గంటకు 575 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అనేక నగరాల మధ్య ఈ రైలు సేవలు ఆ దేశంలో అందుబాటులో ఉన్నాయి. పారిస్ అండ్ స్టార్స్ బర్గ్ మధ్య ప్రయాణించే ఈ రైలు కొన్ని గంటల సమయాన్ని ప్రయాణికులకు ఆదా చేస్తుంది.

Written By: NARESH, Updated On : June 10, 2023 10:29 pm
Follow us on

Fastest Trains : ప్రపంచంలోని అనేక దేశాలు అత్యంత వేగవంతంగా నడిచే రైళ్లను రూపొందిస్తున్నాయి. తాజాగా భారత్ కూడా వందే భారత్ పేరుతో అత్యంత వేగంగా నడిచే రైళ్ళను భారత రైల్వేలో ప్రవేశపెట్టింది. ఈ రైళ్ళను దేశంలోనే అనేక ప్రధాన నగరాల మధ్య నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అనేక దేశాల్లో నడుపుతున్న అత్యంత వేగవంతమైన రైళ్ల గురించి తెలుసుకుందాం.

వందే భారత్ పేరుతో వేగవంతమైన రైలు..

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ సాధారణ రైళ్లలోనే ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే, కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో వేగవంతమైన రైలు ప్రవేశపెట్టే దిశగా ఆలోచన చేసి వందే భారత్ పేరుతో వేగవంతమైన రైలును దేశంలో ప్రవేశపెట్టింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లను అనేక నగరాల మధ్య ప్రస్తుతం నడుపుతున్నారు. దేశంలో నడిచే అత్యంత వేగవంతమైన రైలు ఇదే కావడం గమనార్హం. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే ప్రయాణికులకు అత్యుత్తమమైన ప్రయాణాన్ని సాగించామన్న భావన కలిగించే ఉద్దేశంతో దీన్ని తీసుకువచ్చారు. భారతదేశంలోని మొదటి సెమీ హై స్పీడ్ ట్రైన్ సర్వీస్ గా దీనికి గుర్తింపు ఉంది. ఈ ట్రైన్ టాప్ స్పీడ్ 160 కిలో మీటర్లు.

575 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫ్రాన్స్ రైలు..

ఫ్రాన్స్ లో గంటకు 575 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అనేక నగరాల మధ్య ఈ రైలు సేవలు ఆ దేశంలో అందుబాటులో ఉన్నాయి. పారిస్ అండ్ స్టార్స్ బర్గ్ మధ్య ప్రయాణించే ఈ రైలు కొన్ని గంటల సమయాన్ని ప్రయాణికులకు ఆదా చేస్తుంది. ఫ్రాన్సేస్ ఎల్జివి ఈఎస్టి పేరుతో ప్రస్తుతం ఈ రైలు సేవలు ఫ్రాన్స్ లో అందుబాటులో ఉన్నాయి.

చైనాలో రెండు వేగవంతమైన రైలు..

చైనా దేశంలో రెండు వేగవంతమైన రైలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి సాంఘై మాగ్ లేవ్ ఒకటి కాగా, మరొకటి సిఆర్ 400 ఫక్సింగ్ రైలు ఒకటి. సాంఘై మాగ్ లేవ్ పుడొంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లాంగ్ యంగ్ రోడ్ స్టేషన్ మధ్య తిరుగుతోంది. గంటకు 430 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. అలాగే, సిఆర్ 400 ఫక్సింగ్ బీజింగ్ – శాంఘై – హాంగ్ కాంగ్, బీజింగ్- హర్బిన్ మార్గాల్లో ప్రయాణిస్తుంది. ఇది గంటకు 400 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.

360 కిలోమీటర్ల వేగంతో జపాన్ రైలు..

జపాన్ లోని అనేక ప్రాంతాల్లో టొకాడియో షింకన్సేన్ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు గంటకు 360 కిలో మీటర్ల వేగంతో వెళుతుంది. అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదే కావడం గమనార్హం. టోక్యో – సిన్ ఒకాసా నగరాల మధ్య దీని సేవలు అందుబాటులో ఉన్నాయి.

గంటకు 350 కిలో మీటర్లు వేగంతో స్పెయిన్ సిమెన్స్ వెలారో..

స్పెయిన్ లో గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సిమెన్స్ వెలారో రైలు అందుబాటులో ఉంది. బార్సిలోనా – మాడ్రిడ్ మధ్య ఈ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు నాలుగు గంటల సమయం ఆదా అవుతుంది.

దక్షిణ కొరియాలో కేటీఎక్స్..

దక్షిణ కొరియాలో గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కేటీఎక్స్ రైలు సేవలు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు సియోల్ – బుసాన్ మధ్య నిర్వహిస్తున్నారు.

జర్మనీలో డియోట్స్కీ బాన్..

జర్మనీలో గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే డియోట్స్కీ బాన్ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సేవలను ప్రజలకు ఆ దేశ రైల్వే అందిస్తోంది.