APTA – Pawan Kalyan : ఆప్త జాతీయ సమావేశాలకు హాజరు కావాలని పవన్ కల్యాణ్ కు ఆహ్వానం

పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయనను వారి సమావేశాలకు ఆహ్వానించారు. ఆయన వస్తే సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా మారుతుంది. హుషారు హోరెత్తుతుంది. అందుకే ఆయన రావాలని వారు పట్టుబట్టారు.

Written By: NARESH, Updated On : June 10, 2023 10:17 pm
Follow us on

APTA invitation to Pawan Kalyan : అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేషనల్ కన్వెన్షన్ కు హాజరు కావాలని జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందించారు. అమెరికాలోని తానా కార్యక్రమాలకు హాజరైన పవన్ కు ఆప్త ఎగ్జిక్యూటివ్ బాడీ మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం తమ కార్యక్రమాలకు రావాలంటూ ఆప్త అధ్యక్షుడు నటరాజు ఇల్లురి, బోర్డు చైర్మన్ కిరణ్ ఆహ్వాన పత్రం అందజేశారు.

వారి ఆహ్వానాన్ని అందుకున్న పవన్ కల్యాణ్ సమావేశాలకు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బోర్డు డైరెక్టర్ శ్రీధర్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మన్యం, ఇండియా ఆపరేషన్స్ మధు దాసరి, మాజీ అధ్యక్షుడు వెంకట్, విజయ్ ఉన్నారు. వీరంతా పవన్ కల్యాణ్ తమ సమావేశాలకు వచ్చి వాటిని విజయవంతం చేయాలని కోరారు.

పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయనను వారి సమావేశాలకు ఆహ్వానించారు. ఆయన వస్తే సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా మారుతుంది. హుషారు హోరెత్తుతుంది. అందుకే ఆయన రావాలని వారు పట్టుబట్టారు. తమ సమావేశాలు సజావుగా సాగాలంటే ఉత్సాహం నిండాలని కోరుతున్నారు. దీని కోసమే పవన్ కల్యాణ్ రావాలని కోరుతున్నారు.

పవన్ కల్యాణ్ పేరే ఓ ప్రభంజనం. ఆయన ఎక్కడుంటే జన ప్రవాహం. దీంతోనే ఆప్త సమావేశాలకు ఆయన ఆహ్వానం తప్పనిసరి అనుకుంటున్నారు. దీని కోసమే ఆయనను సభలకు రావాలని ఆహ్వానించారు. ఆయన రాకతో నూతనోత్తేజం వస్తుందని నమ్ముతున్నారు. దీని కోసమే ఆయనకు ఆహ్వానం అందజేశారు. ఇప్పుడు ఆయన రావడం వల్ల సమావేశాల రూపురేఖలే మారుతాయి.