Sydney Bondi Beach Incident: ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత బోండీ బీచ్ ప్రాంతంలో ఆదివారం కాల్పులు చోటుచేసుకున్నాయి. సాజిద్, అతని కుమారుడు తుపాకులతో బీచ్ లో ఉన్న వారందరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వెంటనే అప్రమత్తమైన భద్రత దళాలు తిరిగి కాల్పులు ప్రారంభించడంతో సాజిద్ అక్రమ్, అతడి కుమారుడి ఆగడాలకు చెక్ పడింది.
కాల్పులకు పాల్పడిన సాజిద్ అక్రమ్ గురించి ఆస్ట్రేలియా అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన ఒక విషయం ఆసక్తికరంగా మారింది. సాజిద్ కు హైదరాబాద్ నగరంతో సంబంధాలు ఉండటం కలకలం రేపుతోంది. హైదరాబాదులోని తెలంగాణ డిజిపి కార్యాలయం దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. హైదరాబాదు నగరం నుంచి సాజీద్ పాస్ పోర్ట్ పొందాడు. సాజీద్ బీకాం వరకు చదువుకున్నాడు. 27 సంవత్సరాల క్రితం అంటే 1998లో విద్యార్థి వీసా మీద ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. యూరోపియన్ ప్రాంతానికి చెందిన వెనెరాగ్రోసో అనే యువతని వివాహం చేసుకున్నాడు.
గ్రోసో ద్వారా సాజీద్ ఇద్దరు పిల్లల్ని కన్నాడు. కుమారుడు పేరు నవీన్ అక్రమ్. కుమార్తె పేరు తెలియ రాలేదు. అయితే వీరిద్దరూ ఆస్ట్రేలియా పౌరులు గానే ఉన్నారు. సాజీద్ ఇప్పటికి కూడా భారత పాస్పోర్ట్ ను ఉపయోగిస్తున్నాడు. హైదరాబాద్ నగరంతో సాజిద్ కు చెప్పుకునే స్థాయిలో సంబంధం బాంధవ్యాలు లేవు. సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లిపోయిన తర్వాత ఇండియాకు ఆరుసార్లు వచ్చాడు. ఇక్కడ అతనికి కొంతమేర ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు ఎటువంటి నేర కార్యకలాపాలకు సాజీద్ పాల్పడలేదు. అయితే అతనికి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు తనకు తెలియవని సాజీద్ బంధువులు చెబుతున్నారు.
ప్రఖ్యాత సిడ్నీలోని బోండీ బీచ్ (Sydney Bondi beach) లో ఆదివారం యూదులు హనుక్కా ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. జనం భారీగా రావడంతో ఇదే అదునుగా సాజీద్, అతడి కుమారుడు నవీద్ కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంవత్సరం తెలుసుకునే పోలీసులు అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో సాజీద్ చనిపోయాడు. నవీద్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే వీరిద్దరికి కూడా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా తో సంబంధాలున్నాయని సమాచారం. సాజిద్, అతడి కుమారుడు జరిపిన కాల్పుల వల్ల బోండీ బీచ్ లో 15 మంది చనిపోయారు.