https://oktelugu.com/

Cars: రూ.5 లక్షల లోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లు ఇవే..

ఒకప్పుడు సొంత ఇల్లు ఉంటే చాలు.. అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంటితో పాటు కారు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. కార్యాలయ అవసరాలతో పాటు ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయడానికి కారు నేటి కాలంలో అవసరంగా మారింది. దీంతో సామాన్యులు సైత చిన్న కారును కొనుగోలు చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 26, 2024 / 12:39 PM IST

    Cars

    Follow us on

    Cars: ఒకప్పుడు సొంత ఇల్లు ఉంటే చాలు.. అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంటితో పాటు కారు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. కార్యాలయ అవసరాలతో పాటు ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయడానికి కారు నేటి కాలంలో అవసరంగా మారింది. దీంతో సామాన్యులు సైత చిన్న కారును కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు బడ్జెట్ లో కారు అందించాలని నిర్ణయించాయి. ఇందులో బాగంగా రూ. 5 లక్షల లోపు కార్లను మార్కెట్లకి తీసుకొచ్చి. వీటితో మారుతితో పాటు రెనాల్ట్ తదితర కంపెనీలు ఉన్నాయి. ఇవి మంచి మైలేజ్ ను అందిస్తూ బెస్ట్ ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

    లో బడ్జెట్ లో కారు అందించే మొదటి కంపెనీ మారుతి. Maruthi Company నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి అలరిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి స్విప్ట్, వ్యాగన్ ఆర్ వంటి కార్లు దశాబ్దాలుగా అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంటూ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటున్నాయి. అయితే వీటి కంటే ముందే మార్కెట్లోకి వచ్చిన మరో కారు కూడా మిగతా కార్లకు పోటీ ఇస్తుంది. అదే Maruthi Alto. ఈ కారు చూడ్డానికి చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది. మిగతా కార్లతో పోలిస్తే పరిమాణంలో చిన్నదే అయినా ఇందులో 214 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. 4గురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లే ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం..

    మారుతి ఆల్టో కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. దీనితో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ సిస్టమ్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చారు. సేప్టీ ఫరంగా డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా వంటిని రక్షణ ఇస్తున్నాయి. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 24. 39 నుంచి 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ను ఇస్తుంది. కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే కాకుండా ట్రావెల్ ఏజెన్సీ వారు సైతం ఇష్టపడే ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ. 3.99 లక్షల తో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన ఎస్ ప్రెస్సో కారు కూడా రూ.4.26 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది 24.12 నుంచి 32.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

    లో బడ్జెట్ లో కారు కొనాలని అనుకునే వారికి రెనాల్ట్ కంపెనీ నుంచి క్విడ్ ఆకర్షిస్తోంది. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. దీనిపై లీటర్ పెట్రోల్ కు 21.46 నుంచి 22.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ. 4.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఎంజీ కంపెనీకి చెందిన మరో కారు సామాన్యులను ఆకర్షిస్తోంది. ఈ కంపెనీకి చెందిన కామెట్ ఈవీ రూ. 4.99 లక్షలకే అందుబాటులో ఉంది. 2.50 కిలో వాట్ బ్యాటరీని కలిగిన ఈ కారు ఫుల్ చార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.