horror : హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి. దాని కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలు చాలా వైల్డ్ గా ఉండటమే కాకుండా మన ఊహ కు అద్దం పట్టేలా వాళ్ళ సినిమాలు ఉంటాయి…అందుకే వాటికి ఇండియాలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది…
సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి. వాళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాని చూడడానికి ఇండియాలో ఉన్న యావత్ సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ముఖ్యంగా హాలీవుడ్ లో వచ్చే హర్రర్ మూవీస్ కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఇండియాలో అయితే వాటికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. మన ఇండియాలో హర్రర్ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వరు. అందువల్ల వాటిని చేయడానికి దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించరు. కాబట్టి హర్రర్ సినిమాలు అంటే ఇష్టపడే వాళ్ళు హాలీవుడ్ సినిమాలనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హాలీవుడ్ సినిమా వచ్చి యావత్ ఇండియన్ జనాలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఓ సినిమాలో ఆ సినిమాని ఎక్కడ చూడొచ్చు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
ఏలియన్ రొములస్ పేరుతో ఆగస్టు 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఆదరణను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని చూడటానికి చాలామంది జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఈ సినిమా భారీ వ్యూయర్ షిప్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది అంత హర్రర్ గొలిపే సన్నివేశాలను ఎలా చిత్రీకరించాడు.
నిజంగానే ప్రేక్షకులు ఈ సినిమాను చూసి భయపడుతున్నారా అంటే సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నిజమే అని చెబుతున్నాడు. దానికి కారణం ఏంటి అసలు ఈ సినిమా కథ ఏంటి అంటే ఒక పాడుబడిన స్పేస్ స్టేషన్ నుంచి తమకు కావాల్సిన వస్తువులను సేకరించే సమయంలో ఒక ఏలియన్ వచ్చి వాళ్లపై దాడి చేస్తుంది. మరి అతని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ సినిమా స్టోరీ…ఇక ఎలియన్ సీన్స్ అయితే ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేస్తూ చూపించిన విధానం అయితే చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు…ఇక ఈ సినిమా ఫ్రాంచైజీ లో భాగంగా వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి పార్ట్ 1979 వ సంవత్సరంలో రాగా, రెండవ పార్ట్ 1986వ సంవత్సరంలో వచ్చింది.
ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఇన్ని సంవత్సరాల తర్వాత మరోసారి ఈ సినిమాకు సంబంధించిన ఫ్రాంచైజ్ ని చేసి రిలీజ్ చేశారు… ఇక హర్రర్ సినిమాలు ఇష్టముండి భయపడుతూ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయగలిగే వ్యక్తులు ఎవరిని అయిన సరే ఈ సినిమా ఎంగేజ్ చేస్తుంది…