Credit Card: అత్యవసరంగా డబ్బు అడిగితే ఈరోజుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు Credit Cardలను అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి.Credit Card ద్వారా వస్తువులు కొనుగోలు చేయొచ్చు. కార్డ్ లిమిట్ పై లోన్ తీసుకోవచ్చు. దీనిపై సిబిల్ స్కోరు పెరిగితే ఆఫర్లు, రివార్డులు వస్తుంటాయి. అయితే కొందరు క్రెడిట్ కార్డును ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారు. కానీ దీనిపై ఉన్న బిల్లును కట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వడ్డీ మీద వడ్డీ పడి భారంగా మారుతుంది. దీంతో ఇది ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంది. ఇటీవల తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. అసలేం జరిగిందంటే?
Credit Card అనగానే చాలా మంది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరినీ డబ్బులు అడగకుండా కార్డు ద్వారా అవసరమైనంత డబ్బును వాడుకోవచ్చు. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు వాడడంపై అవగాహన ఉండడం లేదు. కొందరు తమకు ఎలాంటి ఆదాయం లేకున్నా క్రెడిట్ కార్డును తీసుకుంటున్నారు. దీంతో సరైన సమయంలో డబ్బులు అందలేక బిల్లులు చెల్లించలేకపోతున్నారు. తాజాగా తెలంగాణ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు ద్వారా రూ.2 లక్షల వరకు వాడుకున్నారు. కానీ సరైన సమయంలో బిల్లులు చెల్లంచలేకపోవడంతో అది భారంగా మారింది. అయితే దీనిని తీర్చే స్థోమత లేక ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ చెప్పారు. అయితే కొందరు ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఈ పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
Credit Card తీసుకునే ముందే లిమిట్ గురించి ముందే డిసైడ్ చేసుకోండి కొన్ని బ్యాంకులు ముందుగా తక్కువ లిమిట్ అందిస్తుంది. ఇందులో 80 శాతం వరకు వాడుకున్నా సిబిల్ స్కోరు తగ్గే అవకాశం ఉంది. అయితే ఎంత ఎక్కువగా వాడితే అంత ఎక్కువగా క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది కొందరి అపోహ. కానీ సిబిల్ స్కోరు ఆధారంగా మాత్రమే క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. Credit Card తీసుకున్న కొన్ని రోజుల తరువాత క్రెడిట్ లిమిట్ పెరిగేందుకు అవకాశం వస్తుంది. అయితే అవసరం లేకుంటే ఈ లిమిట్ ను అస్సలు పెంచుకోవద్దు. ఎందుకంటే లిమిట్ పెరిగితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతారు.
Credit Card బిల్ జనరేట్ అయిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా చెల్లించాలి. మీ వద్ద డబ్బు లేకపోయినా ఇతర మార్గాల ద్వారా సేకరించి ఈ బిల్లును చెల్లించాలి. ఎందుకంటే ఒక్కసారి బిల్లు మిస్సయితే చాలా వరకు నష్టపోతారు. ఫైన్ తో పాటు అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇలా వడ్డీ పెద్ద మొత్తంలో పెరిగి అసలు తీర్చలేక ఇబ్బందులకు గురవుతారు.
Credit Card ద్వారా అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి. ఇదే సమయంలో అదనంగా ఛార్జీలు వేసే వాటి జోలికి వెళ్లకండి. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వీటిని కార్డు ద్వారా కాకుండా మాన్యువల్ గా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. దీంతో చిన్న మొత్తమైనా కాస్త భారం తగ్గుతుంది.