Homeఅంతర్జాతీయంElon Musk Daughter: అమెరికాలో భవిష్యత్‌ లేదు.. ఎలన్ మస్క్ కూతురు ఆందోళన వెనుక కారణం...

Elon Musk Daughter: అమెరికాలో భవిష్యత్‌ లేదు.. ఎలన్ మస్క్ కూతురు ఆందోళన వెనుక కారణం అదే

Elon Musk Daughter: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. 300 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను చిత్తు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్రంప్‌కు మద్దతు తెలిపారు. ట్రంప్‌ తరఫున ప్రచారం చేశారు. ఎక్స్‌ వేదికగా విస్తృతంగా మద్దతు తెలిపారు. ట్రంప్‌ ఇంటర్వ్యూలను ప్రసారం చేశారు. కమలా హారిస్‌కు వ్యతిరేకంగా వీడియోలు వైరల్‌ చేశారు. ఫలితంగా నవంబర్‌ 5న జరిగిన ఎన్నికల్లో మస్క్‌ మద్దతు తెలిపిన ట్రంప్‌ ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాపై మస్క్‌ సంతోషంగా ఉన్నారు. పండగ చేసుకుంటున్నారు. అయితే ఆయన కూతురు వినియన్‌ జెన్నా విల్సన్‌ మాత్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. తనకు అమెరికాలో భవిష్యత్‌ లేదని పేర్కొంది. ఈమేరకు సామాజిక మాధ్యమం థ్రెడ్స్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘నేను కొన్నాళ్లుగా భయపడుతున్నది… నిన్న వాస్తవ రూపొదాల్చింది. అమెరికాలో ఉంటే నాకు ఎలాంటి భవిష్యత్తు కనిపించడం లేదు. అతను(ట్రంప్‌) నాలుగేళ్లే అధ్యక్షుడిగా ఉండనున్నాడు. లింగమార్పిడి వ్యతిరేక నిబంధనలు ఒక్కసారిగా అమలులోకి రాకపోయినా వాటిని కావాలని ఓటేసినవారు అంత తొందరగా మారరుగా’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

స్పందించిన మస్క్‌..
కూతురు అమెరికాలో భవిష్యత్‌పై ఆందోళనతో పెట్టిన పోస్టు గురించి తెలుసుకున్న మస్క్‌ కూడా ఎక్స్‌లో స్పందించారు. నా కుమారుడిని ఓక్‌ మైండ్‌సెట్‌ చంపేసింది. అని మరోసారి పునరుద్ఘాటించారు. దీనిపై జెన్నా స్పందిస్తూ.. తన తండ్రి ట్వీట్‌ స్క్రీన్‌ షాల్న్‌ థ్రెడ్‌లో పోస్టు చేసింది. ‘ఇంకా నా బిడ్డకు ఏదో సోకింది.. నన్ను నా బిడ్డ ద్వేషించడానికి అదే కారణం అంటూ మళ్లీ పాత కథలే చెప్పొద్దు. వాటిని పట్టించుకోవద్దు. ఏరకంగా చూసినా నేను బాధితురాలిని’ అని ట్వీట్‌ చేసింది.

మొదటి భార్య సంతానం..
జస్టిన్‌ విల్సన్‌ ఎలాన్‌ మస్క్‌ తొలి భార్యకు జన్మించిన సంతానంలో ఒకరు. 2022లో లింగమార్పిడి చేయించుకుని తన పేరును వినియన్‌ జెన్నా విల్సన్‌గా మార్చుకుంది. మస్క్‌కు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఆమె తన తండ్రికి దూరంగా ఉంటోంది. జెన్నాకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువ. డబ్బులున్న వాళ్లందరూ చెడ్డవాళ్లు అని భావిస్తుంది. ఆమె అలా మారడానికి తను చదువుకున్న స్కూలే కారణం. తిరిగి ఆమెతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు మస్క్‌. ఆమె నాతో కాస్త సమయం కూడా గడపడానికి ఇష్టపడడం లేదని మస్క్‌ తెలిపారు. జెన్నాతో విభేదాలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. మొదటి కుమార్తె మరణం కన్నా.. జెన్నాతో విభేదాలే ఎక్కువగా మాధించాయని మస్క్‌ తన జీవిత చరిత్రలో పేర్కొన్నాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version