https://oktelugu.com/

Prabhakar Rao: అమెరికాలో సెటిల్‌ అయిపోయిన ప్రభాకర్‌రావు..ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

తెలంగాణ పోలీసులకు మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఝలక్‌ ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా అమెరికాలో సెటిల్‌ అయ్యారు. దీంతో కేసు విచారణలో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 8, 2024 2:25 pm

    Prabhakar Rao

    Follow us on

    Prabhakar Rao: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లు, సినీ నటుల ఫోన్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫోన్లు కేసీఆర్‌ ట్యాపింగ్‌ చేసిన విషయం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బయటపడింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే విచారణలో ఫోన్‌ ట్యాపింగ్‌కు ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్‌రావు ఉన్నట్లు తెలిపారు. అయప్పటికే ఆయన అమెరికా వెళ్లిపోయాడు. ఆయనను రప్పించేందకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు సహకరిస్తానని, తాను అమెరికాలో శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెబుతూ వర్చారు. కానీ, ఇప్పుడు స్వదేశానికి ఇప్పట్లో రాకూడదని నిర్ణయించుకుని తెలంగాణ పోలీసులకు షాక్‌ ఇచ్చాడు. దీంతో అక్కడే సెలిట్‌ అయ్యేందుకు అమెరికా గ్రీన్‌ కార్డు పొందారు.

    గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ బాధ్యతలు..
    రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన ప్రభాకర్‌రావును కేసీఆర్‌ ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని భావించి కీలక ఆధారాలను ధ్వసం చేశారు. కొత్త ప్రభ్వుం కొలువుదీరిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రేవంత్‌ సర్కార్‌ విచారణకు ఆదేశించింది. అయితే అప్పటికే ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు పలువురు అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని నడిపించిన ప్రభాకర్‌రావు మాత్రం విచారణకు రాలేదు. శస్త్ర చికిత్స, ట్రీట్‌మెంట్, విశ్రాంతి అంటూ ఇన్నాళ్లూ సమాచారం ఇచ్చారు. దీంతో లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ, ఇంతలోనే ప్రభాకర్‌రావు ఝలక్‌ ఇచ్చారు. ప్రభాకర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పట్లో దేశానికి రావొద్దని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో డిపెండెంట్‌ క ఓటాలో గ్రీన్‌ కార్డు పొందారు.

    కేటీఆర్‌ను కలిసినట్లు ప్రచారం..
    ఇక బీఆర్‌ఎస్‌ పాలనలో ముఖ్యమైన మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ రెండు నెలల క్రితం అమెరికా వెళ్లారు. ఈ సమయంలో ఆయన రహస్యంగా ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును కలిసినట్లు ప్రచారం జరిగింది. ఆయన ఇండియా రాకుండా ఉండాలని సూచించారట. ప్రభాకర్‌రావు ఇండియాకు వస్తే బీఆర్‌ఎస్‌లో కీలక నేతల బండారం బయటపడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన అమెరికాలోనె స్థిరపడేలా కేటీఆర్‌ కూడా తనవంతు సహకారం అందించినట్లు తెలుస్తోంది.

    ఎఫ్‌ఐఆర్‌ నమోదైన మర్నాడే..
    ఇదిలా ఉంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందులో ప్రభాకర్‌రావును ఏ1గా చేర్చారు. మరుసటి రోజే ప్రభాకర్‌రావు దేశం నుంచి పారిపోయారు. ఎస్‌బీఐ అదనపు ఎస్పీ రమేశ్‌ ఈ ఏడాది మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఫిర్యాదుచేశారు. మార్చి 11న ప్రభాకర్‌రావు దేశం వీడి వెళ్లారు. అప్పటి నుంచి అమెరికాలోనే ఉంటున్నారు. ఆయనను రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు నెలల గడువుపై వెళ్లిన ఆయన తర్వాత దానిని పొడిగించుకున్నారు. ఇప్పుడు ఏకంగా గ్రీన్‌కార్డు పొందారు.

    పాస్‌పోర్టు రద్దు..
    ఈ క్రమంలో ప్రభాకర్‌రావుకు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించే ప్రయత్నాలు చేశారు. పాస్‌పోర్టు రద్దు చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు సమాచారం ఇచ్చే ్ర‘కమంలో ప్రభాకర్‌రావు గ్రీన్‌ కార్డు పొందిన విషయం బయటకు వచ్చింది. దీంతో ఆయనను ఇప్పటల్లో ఇండియాకు రప్పించే అవకాశం లేదు.