Dangerous chicken gunya : చికెన్ గున్యా కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఏ పనీ చేయలేని పరిస్థితి వస్తుంది. తినడం కూడా కష్టమే. వ్యక్తి కచ్చితంగా కావాలి. చికెన్ గున్యా నుంచి త్వరగా కోలుకోవాలంటే మందులు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ఆహార కూడ అవసరమే. వేప ఆకులు వేసిన గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం, తులసి ఆకులతో స్నానం చేయడం మంచిది. కొద్దిగా ఉప్పు వేసి స్నానం చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. ఆ తర్వాత లవంగాల నూనెతో మర్దనా చేసుకోవాలి.
ఆహారం తినబుద్ధి కాకపోతే పళ్ల రసాలు, పండ్లు తీసుకోవడం మంచిది. ఉడక బెట్టిన గుడ్లు, బెల్లంతో చేసిన వంటలు తినడం మంచి అలవాటు. విటమిన్ డి, క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు పన్నీర్, రాగి జావ, మజ్జిగ, పాలు తీసుకోవాలి. వీటిల్లో మంచి పోషకాలు ఉంటాయి. కాబట్టి తర్వగా చికెన్ గున్యా నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే వర్షాలు ఇతర కాలుష్య కారణాల వల్ల దోమల ఎక్కువ వస్తాయి. దీనిల్ల చికున్గున్యా వ్యాపిస్తుంది. చికున్గున్యా వైరస్ వల్ల కలిగే వైరల్ వ్యాధి కాబట్టి జాగ్రత్త వహంచాలి.
ఏడిస్ దోమల ద్వారా ఈ చికెన్ గున్యా వస్తుంది. దీనివల్ల విపరీతమైన కీళ్ల నొప్పులు, జ్వరం వస్తుంది. అందుకే ఇది రాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఇంటి నివారణలు, సెల్ఫ్ కేర్ తీసుకోవడం వల్ల ఈ చికెన్ గున్యా నుంచి బయటపడవచ్చు. 2005, 2010 మధ్యకాలంలో చికున్ గున్యా ఇండియాను చాలా భయపెట్టింది. అప్పటి నుంచి దీనికి భయపడేవారు చాలామందే ఉన్నారు. అందుకే దీని గురించిన ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చికున్ గున్యా వైరస్ సోకిన దోమ కుట్టిన నాలుగు నుంచి ఎనిమిదిరోజుల్లో ఈ వ్యాధి డెవలప్ అవుతుంది. ఒకటి నుంచి రెండువారాల వరకు దీని లక్షణాలు ఉంటాయి.
అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు నెలలు, సంవత్సరాల వరకు ఉంటాయి. జ్వరం ఉన్న సమయంలో తలనొప్పి వేధిస్తుంది. తీవ్రమైన అలసట, అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. వికారం, వాంతులు ఉంటాయి. పరిస్థితి విషమించే సమయంలో ఇది కాలేయాన్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త.