Name Astrology: మీ పేరు N లెటర్‌తో స్టార్ట్ అవుతుందా.. మరి మీ వ్యక్తిత్వం ఎలా ఉందంటే?

న్యూమరాలజీ ప్రకారం N లెటర్‌తో స్టార్ట్ అయ్యే పేర్లు గల మనుషుల వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది. మరి ఈ లెటర్‌తో స్టార్ట్ అయ్యే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? వీళ్ల లక్షణాలు ఏంటి? పూర్తి వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : August 31, 2024 1:11 pm

Name-Astrology

Follow us on

Name Astrology: ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఇద్దరూ మనుషులు ఒకేలా ఉండరు. ఒక్కోరి మనస్తత్వం, ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఒక్కోరిలో కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లెటర్‌లోని ప్రతి లెటర్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇందులోని ఏ లెటర్‌తోనైనా స్టార్ట్ పేర్లు ఉన్నాయి. ప్రతి లెటర్ బట్టి వాళ్ల ప్రవర్తన ఉంటుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం N లెటర్‌తో స్టార్ట్ అయ్యే పేర్లు గల మనుషుల వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది. మరి ఈ లెటర్‌తో స్టార్ట్ అయ్యే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? వీళ్ల లక్షణాలు ఏంటి? పూర్తి వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.

N లెటర్‌తో స్టార్ట్ అయ్యే వ్యక్తులకు ఎలాంటి పరిమితులు, కండిషన్లు లేకుండా స్వతంత్రంగా ఉండాలని భావిస్తారు. వాళ్లకు నచ్చిన పనులు చేయడానికి ఇష్టపడతారు. వీరికి పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఏ పనిలోనైనా అధికంగ పాజిటివ్ అంశాలనే చూస్తారు. చేయాలనుకున్న పనులను కష్టమైన తప్పకుండా చేస్తారు. వీళ్ల ఆలోచన ధోరణి కొత్తగా ఉంటుంది. పెద్దవాళ్లకు, ఎదుట వారికి గౌరవం ఇస్తుంటారు. ఇతరులపై ఆధారపడరు. ఎక్కువగా సొంత ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఏం చెప్పిన గుడ్డిగా నమ్మేస్తారు. కానీ ఈ వీళ్లు మాత్రం చెప్పుడు మాటలు వినరు. నమ్మినా వాటిని అంతగా పట్టించుకోరు. వీరికంటూ సొంతగా ఒక ఆలోచన ఉంటుంది. ఆ నిర్ణయాలకే కట్టుబడి ఉంటారు.

ఈ లెటర్ వ్యక్తులు ఎవ్వరితో కూడా అంతగా స్నేహం చేయరు. కానీ ఒకవేళ స్నేహం చేస్తే మాత్రం ప్రాణం పెడతారు. వీళ్లు చాలా తక్కువగా మాట్లాడతారు. వీళ్లకి సక్సెస్ కూడా లేటుగా వస్తుంది. వీళ్లను అర్థం చేసుకోవడం కాస్త కష్టం. లెటర్ మనుషులకు తొందరగా ఆకర్షితులవుతారు. అలాగే వీళ్లు గొప్ప ప్రతిభావంతులు. ఇతరులు ఏదైనా విషయాన్ని ఒప్పుకోకపోతే.. ఒప్పించే టాలెంట్ వీరిలో ఉంటుంది. వీళ్లు మాట్లాడే విధానానికి అవతలి వ్యక్తి ఎలాంటి వాళ్లు అయిన సరే ఒప్పుకోవాల్సిందే. ఏ పనినైనా ఈజీగా చేస్తేస్తారు. చాలా జ్ఞానవంతులు. ప్రతి వర్క్‌లో వాళ్లు మార్క్ చూపించుకుంటారు.

సాధారణంగా ఎవరైనా ఇతరుల అభిప్రాయాలను అడుగుతుంటారు. కానీ ఈ లెటర్ వాళ్లు మాత్రం అసలు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరు. వాళ్ల సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఈ లెటర్ వ్యక్తుల మనుసులో ఏముందో అని తెలుసుకోవడం చాలా కష్టం. అసలు బయట పడరు. కోపం కూడా ఎక్కువే. కానీ బయటకు తెలియనివ్వరు. వీళ్లకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఆలోచనలు పెరుగుతాయి. అయితే వీళ్ల జీవితం అంతా పూలపాన్పు ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లైఫ్‌లో విజయాన్ని సాధిస్తారు.