Site icon OkTelugu

Vijay Deverakonda Rashmika Mandanna Wedding: విజయ్- రష్మిక పెళ్లి లో సందీప్ రెడ్డి వంగ కి అవమానం జరిగిందా..? అలా ఎలా చేశారు…

Vijay Deverakonda Rashmika Mandanna Wedding

Vijay Deverakonda Rashmika Mandanna Wedding

Vijay Deverakonda Rashmika Mandanna Wedding: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…ఆయన చేసిన సినిమాలు అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి… ఈ మధ్యకాలంలో తను చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికి ఆయన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. గత సంవత్సరం వచ్చిన కింగ్ డమ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడని అందరు అనుకున్నారు. కానీ అది తేడా కొట్టడంతో ఆయన ఇమేజ్ కొంతవరకు తగ్గినట్టు అనిపించినా కూడా తన మార్కెట్ మాత్రం ఎక్కడ డల్ అవ్వలేదు. ఇక దాంతో ఇప్పుడు మరో రెండు సినిమాలను రంగంలోకి దించుతున్నాడు. విజయ్ దేవరకొండ రష్మిక మందాన గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ రోజు ఈ జంట పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక వీళ్ళ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు చాలా తక్కువ మంది అతిధులు హాజరైనట్టుగా తెలుస్తుంది. అందులో సందీప్ రెడ్డి వంగ మొదటి గెస్ట్ గా రావడం విశేషం… ఇక సందీప్ రెడ్డి వంగతో పాటు మరికొంతమంది సినిమా సెలబ్రిటీలైతే వచ్చారు. వాళ్ళందరి ఫోన్లను తీసుకున్న అక్కడి సిబ్బంది వాళ్లెవరికి కూడా ఫోటోలు తీసుకునే అవకాశం కల్పించలేదట. ఇక దానికి తోడుగా సందీప్ రెడ్డివంగ కి ఈరోజు స్పిరిట్ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ తో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి.

కానీ విజయ్ దేవరకొండ తనకు చాలా మంచి ఫ్రెండ్ కావడం తన మొదటి సినిమా హీరో అవ్వడంతో అతని పెళ్లి మిస్ చేయకూడదనే ఉద్దేశ్యంతోనే పెళ్లికి హాజరయ్యాడు. ఇక అక్కడ తన ఫోన్లో వీడియో కాల్ లో టెక్నీషియన్స్ తో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి అక్కడ ఉన్న సిబ్బంది ఓవర్ యాక్టింగ్ చేశారట. సందీప్ నుంచి ఫోన్ తీసుకున్న సిబ్బంది తన వీడియో కాల్ మాట్లాడతానంటే మొబైల్ తిరిగి ఇవ్వలేదట.

దాంతో సందీప్ వాళ్ల మీద ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో ఆనంద్ దేవరకొండ వచ్చి ఆ మొత్తాన్ని సెటిల్ చేశాడు. సందీప్ మొబైల్ తనకిచ్చి తన మీటింగ్ సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారట. మొత్తానికైతే అక్కడ అందరు హ్యాపీగా ఉన్నారు.

ఇక ఈ విషయాన్ని అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ సన్నిహితులతో పంచుకోవడం వల్ల ఈ మ్యాటర్ లీక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ వైరల్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఉన్న బిజీలో సైతం విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

Exit mobile version