భారత్ ను వింత కోరిక కోరిన తాలిబన్లు

భారత్ ను తాలిబన్లు వింత కోరిక కోరారు. రెండు దేశాల మధ్య కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను తాలిబన్లు కోరారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు అఫ్గాన్ పౌరవిమానయాన శాఖ లేఖ రాసింది. ఈ లేఖను భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అఫ్గాన్ పౌరవిమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హజ్ హమీదుల్లా అఖుంజాదా సంతకంతో ఉన్న ఈ లేఖను సెప్టెంబరు 7నే […]

Written By: Velishala Suresh, Updated On : September 29, 2021 2:11 pm
Follow us on

భారత్ ను తాలిబన్లు వింత కోరిక కోరారు. రెండు దేశాల మధ్య కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను తాలిబన్లు కోరారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు అఫ్గాన్ పౌరవిమానయాన శాఖ లేఖ రాసింది. ఈ లేఖను భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అఫ్గాన్ పౌరవిమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హజ్ హమీదుల్లా అఖుంజాదా సంతకంతో ఉన్న ఈ లేఖను సెప్టెంబరు 7నే పంపినట్లు తెలుస్తోంది.

అమెరికా దళాలు అఫ్గాన్ నుంచి వెనక్కి వెళ్లే క్రమంలో కాబుల్ ఎయిర్ పోర్టు ధ్వంసమైంది. దీంతో అక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మా సోదర దేశమైన కతర్ సాంకేతిక సాయంతో విమానాశ్రయాన్ని పునరుద్ధరించగలిగాం. ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించే విషయమై ఇప్పటికే విమానయాన సంస్థలకు నోటీసులు పంపాం. భారత్, అఫ్గాన్ మధ్య తిరిగి ప్రయాణికుల రాకపోకలు జరగాలని కోరుకుంటున్నాం. కమర్షియల్ విమనాల సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నాం అని లేఖలో రాసినట్లుగా ఉంది.

ఆగస్టు 15న అఫ్గాన్ రాజధాని కాబుల్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశానికి కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ తర్వాత భారత ప్రభుత్వం అమెరికా, నాటో దళాల సాయంతో ప్రత్యేక విమానాలు నడిపి అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకోచ్చారు. అలాగే అఫ్గనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే పాలన కొనసాగుతుందని తమ చర్యల ద్వారా తాలిబన్లు తెలియజేస్తున్నారు. హెల్మాండ్ ప్రావిన్సుల్లో క్షౌరశాలలకు గడ్డం గీయవద్దంటూ హుకుం జారీ చేశారు.