Homeఅంతర్జాతీయంNRI News : కూటమి గెలుపులో ఎన్నారైల పాత్ర కీలకం.. ఏపీ అభివృద్ధిలోనూ భాగస్వాములు...

NRI News : కూటమి గెలుపులో ఎన్నారైల పాత్ర కీలకం.. ఏపీ అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలి.. ఆత్మీయ సమ్మేళనంలో వెనిగండ్ల రాము! 

NRI News :  ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కలిసి పోటీచేశాయి. అధికారంలో ఉన్న వైసీపీని చిత్తుగా ఓడించాయి. 164 సీట్ల తిరుగులేని మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. గడిచిన ఐదేళ్లు అనేక ఇబ్బందులు ఎదుక్కొన్న టీడీపీ, జనసేన నేతలు గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఐదేళ్లు పడిన కష్టాలేను ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. ఇదిలా ఉంటే  టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి గెలుపు కోసం వందల మంది ఎన్నారైలు ఎన్నికల ముందు ఏపీలో పర్యటించారు. ప్రచారం చేశారు. సాంకేతికత సాయంలో ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. దీంతో ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎమ్మెల్యేలు అమెరికాకు వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సీనియర్‌ నేత కొడాలని నానిపై ఘన విజయం సాధించిన ఎన్నారై వెనిగండ్ల రాము ఇటీవలే అమెరికా వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.
న్యూజెర్సీలో అభినందనసభ..
ఎమ్మెల్యేగా అమెరికాలో అడుగు పెట్టిన వెనిగండ్ల రామును అక్కడి తెలుగువారు, టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానులు ఆత్మీయంగా సత్కరించారు. నూజెర్సీలోని మోన్మౌత్‌ జంక్షన్‌లోని ఎంబెర్‌ బాంకెట్స్‌లో న్యూజెర్సీ కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. సుమారు 400 మంది తెలుగురవారు ఈ సభకు హాజరయ్యారు. చాలా మంది కుటుంబాలతో కలిసి వచ్చారు. జోహార్‌ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అంటూ పలువురు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ  ఎన్నారైలు  గుడివాడ  ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించుటకు అనువుగా ఉంటుందని, ఏపీ లో పెట్టుబడులు పెట్టి  గుడివాడ  నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారైలు ఈసారి  ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎనలేని కృషి చేసారని కొనియాడారు.
చంద్రబాబు తరఫున కృతజ్ఞతలు..
ఇదే వేదికపై రాము.. ఎన్నారైలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన ఎన్నారైలకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. ఎన్నారైలకు ప్రత్యేక అభినందనలు తెలపాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిపారని పేర్కొన్నారు. కూటమిని గెలిపించినట్లుగానే.. ఏపీని అభివృద్ధిలో కూడా ముందు వరుసలో నిలిపేందుకు ఎన్నారైలు చొరవ చూపాలని కోరారు. పెట్టుబడులతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే ఎన్నారైలకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు.  ఎన్నారైలు విద్యాధర్‌ గారపాటి , శ్రీహరి మందాడి, సమతా కోగంటి, హరి ముత్యాల, రాధా నల్లమల్ల, జగదీశ్‌ యలమంచలి, రాజా కసుకుర్తి తదితరులు ఎన్నికల సంగ్రామంలో తమ అనుభవాలని పంచుకున్నారు. కార్యక్రమంలో తానా తాజా మాజీ అధ్యక్షుడు  లావు అంజయ్య చౌదరి,  తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షడు టీజీకే.మూర్తి, సాయికృష్ణ బొబ్బా. శ్రీనివాస్‌ ఓరుగంటి, సతీష్‌ మేకా, న్యూ జెర్సీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version