Homeఅంతర్జాతీయంRobot: రోబోటిక్‌ ఐవీఎఫ్‌ సంచలనం.. కవల పిల్లల జననం!

Robot: రోబోటిక్‌ ఐవీఎఫ్‌ సంచలనం.. కవల పిల్లల జననం!

Robot: కేతిక విప్లవం వైద‍్యరంగంలో సంచలన మార్పులు తీసుకువస్తోంది. ఆధునిక పరిజ్ఞానంతో చికిత్సలు సులభం అవుతున్నాయి. ఖరీదైన వైద్యం సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది. తాజాగా వైద్య రంగం మరో మైలురాయిని చేరుకుంది. టెక్నాలజీ సాయంతో చేసిన ఐఫీఎఫ్‌ సక్సెస్‌ అయింది. ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్‌తో పండంటి ఆడపిల్లలు జన్మించారు.

పిల్లలు లేని లోటు ఉండదిక..
ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్‌ విజయవంతమైంది. ఎంఐటీ టెక్నాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్పెయిన్‌లోని బార్సిలోనాకి చెందిన ఓ ఇంజినీర్ల బృందం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మానవ అండంలోకి రోబో సాయంతో శుక్రకణాలను ప్రవేశపెట్టింది. రెండు పిండాలు అభివృద్ధి చెంది.. 9 నెలల తర్వాత కవలలు జన్మించారు. ఈ ప్రయోగానికి న్యూయార్క్‌ సిటీలోని న్యూహోప్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ వేదికైంది. సామాన్యులకు అందని ద్రాక్షగా మిగిలిపోతున్న సాధారణ ఐవీఎఫ్‌ స్థానంలో రోబో ద్వారా చేసిన ఐవీఎఫ్‌ అందుబాటులోకి వస్తే.. పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న చాలా జంటలకు ఇక ఆ లోటు ఉండదని అంటున్నారు.

అనుభవం లేకపోయినా..
వాస్తవానికి ఈ ప్రయోగం చేపట్టిన ఇంజినీర్లకు ఫెర్టిలిటీ అంశంపై పెద్దగా అనుభవం ఏమీ లేదు. సూదిలాంటి సన్నని రోబోను ఉంచేందుకు.. వీళ్లు సోనీ ప్లే స్టేషన్‌ 5 కంట్రోలర్‌ను ఉపయోగించారు. అందులో శుక్రకణాలను నింపి ఉంచారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై స్పెర్మ్‌ను జారవిడిచింది. రెండు రోజుల వ్యవధిలో అవి ఫలదీకరణం చెంది.. పిండాలుగా మారినట్లు ఇంజినీర్ల బృందం వెల్లడించింది. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రసుత్తం అవలంబిస్తున్న ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌)తో పోల్చితే, దీనికయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోబోను ఓవర్‌ట్యూర్‌ లైఫ్‌ అనే స్టార్టప్‌ సంస్థ అభివృద్ధి చేసింది. అతి తక్కువ ఖర్చుతో ఆటోమేటిక్‌ ఐవీఎఫ్‌ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ ప్రయోగం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్‌లో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఓవర్‌ట్యూర్‌ లైఫ్‌ చెబుతోంది.

ప్రస్తుతం చాలా మంది అవలంబిస్తున్న ఐవీఎఫ్‌ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాలి. చాలా జాగ్రత్తగా మైక్రోస్కోప్‌ ద్వారా పరిశీలిస్తూ అండంతో, శుక్రకణాన్ని ఫలదీకరణం చెందించాల్సి ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా.. కొన్నిసారు ఇది విఫలమైన సందర్భాలూ ఉంటాయి. కానీ, రోబోతో చేసిన ఐవీఎఫ్‌ వంద శాతం సక్సెస్‌ కావడం వైద్య రంగంలో సంచలనమే అంటున్నారు వైద‍్య నిపుణులు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version