US Presidential Elections: కొత్త అమెరికా అధ్యక్షుడి చేతిలో భారతీయుల భవితవ్యం.. సత్తా చాటబోతున్న భారతీయులు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు రోజులే గడువు ఉంది. నంవంబర్‌లోకి ఎంటర్‌ అయ్యాం. దీంతో అగ్రరాజ్యం ఓటర్లు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లారు. ఎవరికి ఓటేయాలో డిసైడ్‌ అవుతున్నారు. తమ అధినేత ఎవరు కావాలో నిర్ణయం తీసుకుంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 1, 2024 12:46 pm

US Presidential Elections(2)

Follow us on

US Presidential Elections: అమెరికా ఓటర్లు తమ అధినేతను నిర్ణయం తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. నవంబర్‌ 5న నిర్వహించే పోలింగ్‌లో తమ తీర్పును వెల్లడించేందుకు సిద్దమవుతున్నారు. ఇకప్రపంచ దేశాలు కూడా అగ్రరాజ్యాధినేత ఎవవుతారు.. తమకు ఎవరు అయితే లాభం.. ఎవరు అయితే నష్టం అని లెక్కలు వేసుకుంటున్నాయి. యావత్‌ ప్రపంచ మంతా ఇప్పుడు అమెరికా వైపే చూస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రపంచంలో ఉన్న మెజారిటీ దేశాలు అమెరికాపై ఆధారపడినవే. అందుకే అమెరికాకు జలుపు చేస్తే.. ప్రపంచానికి జ్వరం వస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఈ ప్రభావం నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేస్తున్నా.. బయటపడలేకపోతున్నాయి. అందుకే అధ్యక్ష ఎన్నిల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎ దురు చూస్తున్నాయి. ఇక భారతీయులు ఈసారి అమెరికా ఎన్నికల్లో ఎక్కువగా ఇన్‌వాల్వ్‌ అవుతున్నారు. ఎందుకంటే.. భారతీయుల భవితవ్యం నూతన అధినేతపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల్లో భారతీయుల ఓట్లు కీలకం కానున్నాయి. అందుకే తమ భవితవ్యాన్ని నిర్ణయించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. భారత వ్యతిరేకి ఎగిలిస్తే భారతీయుల అమెరికా కల చెదురుతుంది. అనుకూలమైన నేత గెలిప్తే అవకాశాలు పెరుగతాయి. ఎన్నికల రేసులో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తునర్న వ్యూహాలు పూర్తిగా భారతీయ రాజకీయాలను తలపిస్తున్నాయి.

మోదీని ఫాలో అవుతున్న ట్రంప్‌..
రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాలో అవుతున్నారు. ఇటీవల ట్రంప్‌ పూర్తి గార్బేజ్‌ కలెక్షన్స్‌ చేసేవారి యూనిఫాంలో ప్రచారం చేశారు. కమలా హారిస్‌కు ఓటు వేస్తే చెత్త తప్ప ఏమీ ఉండదని ఇలా ప్రచారం చేశారు. దీనిని చూస్తే.. చాలా మందికి మోదీ గుర్తుకువచ్చారు. భారత్‌లో మోదీ కాంగ్రెస్‌ను ఇలాగే కార్నర్‌ చేశారు. మొదట చాయ్‌ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. చాయ్‌ అమ్ముకునేవారితో మాట్లాడారు. తర్వాత పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగారు. సత్కారాలుచేశారు. ఇలా అనేక స్ట్రాటీజీలు మోదీకి కలిసి వచ్చాయి. ఇప్పుడు ట్రంప్‌ కూడా ఇదే ఫాలో అవుతున్నారు.

ఓటుకు నోటును పరిచయం చేస్తున్న ట్రంప్‌..
ఇక అమెరికా ఎన్నికల్లోనూ ట్రంప్‌ ఓటుకు నోటును పరిచయం చేస్తున్నారు. ఓటుకు నోటు అనేది దశాబ్దకాలంగా భారత్‌లో బాగా పెరిగింది. ఓటర్లు నేరుగా ఓటేస్తే ఎంత ఇస్తావని అడుగుతున్నారు. తమకు డబ్బులు ఇవ్వలేదని ఆందోళనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ఈ సంస్కృతి బాగా పెరిగింది. ఎన్నిక ఏదైనా డబ్బులే నడిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా ఓటుకు నోటు సంస్కృతి వస్తోంది. ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఓటు వేసేలా మోటివేట్‌ చేసేందుకు ఓ పిటిషన్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రోజుకు ఒకరు చొప్పున మిలియన్‌ డాలర్లు ఆఫర్‌ చేశారు. ఇస్తున్నారు కూడా. ఇది రాజ్యాంగ విరుద్ధమని అమెరిక ప్రభుత్వం విచారణ చేపట్టింది. మస్క్‌ ఓటుకు నోటు మాత్రమే కాదు.. ట్విట్టర్‌ను ఉపయోగించి ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. ఇండియా తరహాలో ఓటరు జాబితాలో తేడాలు.. బ్యాలెట్‌ బాక్సులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ప్రచారంలో భారతీయులకు ప్రాధాన్యం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మూలాలున్న ఓటర్లు తక్కువేం కాదు. మొత్తం ఓటర్లలో 6 శాతం భారతీయ అమెరికన్‌ ఓటర్లు ఉన్నారు. అందుకే ప్రచారంలో అభ్యర్థులు భారతీయులను విస్మరించలేని పరిస్థితి. ప్రధానంగా స్వింగ్‌ స్టేట్స్‌లో భారతీయుల ప్రభావం ఎక్కువ. ఇక్కడ గెలిచిన నేతలే అమెరికా అధ్యక్షలు అవుతారన్న సెంటిమెంట్‌ ఉంది. దీంతో భారతీయులకు అభ్యర్థులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక పోటీలో ఉన్న కమలా హారిస్‌ భారతీయ మూలాలు ఉన్న నేత. ట్రంప్‌ భారత్‌తో బలమైన బంధం కోరుకుంటున్న నేత. ఈ నేపథ్యంలో భారతీయులు ఎటు మొగ్గుచూపుతారన్నది కీలకంగా మారనుంది. భారతీయ మూలాలు ఉన్న నేత అధ్యక్షరాలు కావాలని చాలా మంది భారతీయులు కోరుకుంటున్నారు. ఇక కొందరు ట్రంప్‌వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా ప్రమీలా జయపాల్‌ కేరళ నుంచి వెళ్లారు. 2016లో హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌కు ఎన్నికలయ్యారు. అమెరికా సెనెటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్‌గా కమలా హారిస్‌ రికార్డుకు ఎక్కారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. ఆమె భారత సంతతి తొలి అధ్యక్షరాలు, అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కుతారు.

ఎవరు గెలిస్తే ఏంటి?
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిస్తే భారతీయులకు ఏంటి అన్న లెక్కలు వేస్తున్నారు. ట్రంప్‌ మొదటిసారి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు అమెరికా భావజాలం విస్తృతం చేశారు. ఆయనది బీజేపీ తరహా రాజకీయం. మెజారిటీ ప్రజలను మైనారిటీలపైకి రెచ్చగొట్టి విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం చేస్తున్నారు. అమెరికా ఫస్ట్‌.. అదర్స్‌ నెక్ట్స్‌ అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇక కమలా ప్రచారం హుందాగా ఉంది. భారతీయ వాసనలు ఉండడంతో సగటు అమెరికన్‌ కోరుకునే హుందాతనం ఆమెలో కనిపిస్తోంది. అగ్రరాజ్య గౌరవం నిలబెట్టాలన్న తీరు ఆమెలో కనిపిస్తోంది.

ఓట్లు ఎక్కువ వచ్చినా ఓటమి..
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ వచ్చినా ఓడిపోయే అవకాశం ఉంటుంది. జార్జిబుష్‌ జూనియర్‌ మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన కంటె డెమొక్రటిక్‌ పార్టీ అబ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ జార్జిబుష్‌ జూనియర్‌ గెలిచాడు. ఎందుకంటే.. అమెరికా ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. 50 రాస్ట్రాల్లో ఆధిక్యత సాధించడమే కీలకం. ఎక్కువ రాస్ట్రాల్లో మెజారిటీ సాధించడం కీలకం. మొదటి నుంచిర రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య రాస్ట్రాల వారీగా పోరు సాగుతోంది. కొన్ని రాస్ట్రాలు డెమొక్రాట్లకు, కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్లకు మద్దతు ఇస్తున్నాయి. స్వింగ్‌ స్టేట్స్‌ మాత్రం ఎటూ తేల్చడం లేదు. అందుకే ప్రతీ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాలు కీలకం అవుతున్నాచి.