Quick Commerce: అసలేంటి ‘క్విక్‌ కామర్స్‌’.. ఏడాదిలో 2 లక్షల దుకాణాలు మూత!.. కారణం ఏంటి?

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అవుతున్నారు. బంధాలు, అనుబంధాలు దూరం అవుతున్నాయి. ఒకప్పుడు కిరాణా దుకాణాల్లో ఖతాపై సరుకులు తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు దుకాణాలే కనుమరుగవుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : November 1, 2024 1:03 pm

Quick Commerce

Follow us on

Quick Commerce: కిరాణాదుకాణం.. రాబోయే రోజుల్లో ఓ జ్ఞాపకంగా మిలిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఒకప్పుడూ ఊళ్లో షావుకారులు కిరాణా దుకాణాలు నిర్వహించేవారు. ఊరంతా అక్కడకు వెళ్లి ఉద్దెరపై సరుకులు తెచ్చుకునేవారు. తర్వాత పట్టణాల్లోనూ వేతన జీవులు ఇలాగే సరుకులు తెచ్చుకునేవారు. నెల జీతం రాగానే దుకాణంలో ఖతా డబ్బులు చెల్లించేవారు. ఇలా లావాదేవీలు జరిగేవి. దీంతో వ్యాపారులు, ప్రజలకు మధ్య అనుబంధం ఏర్పడేది. నమ్మకం ఉండేది. కానీ ఈకామర్స్‌ వచ్చాక కిరాణా దుకాణాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే చాలా మంది కిరాణా దుకాణాదారులు షాపులు మూసివేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లోకి కూడా ఈ కామర్స్‌ సేవలు విస్తరించాయి. డెలివరీ బాయ్స్‌ మారు మూల పల్లెలకూ వెళ్తన్నారు. దీంతో గ్రామాల్లోనూ కిరాణా శాపులు మూత పడుతున్నాయి. ఒకప్పుడు షాపింగ్‌ మాల్స్‌ ప్రభావం కిరాణా షాపులపై ఉండేది. కానీ ఇప్పుడు కిరాణా షాపులతోపాటు, షాపిగ్‌ మాల్స్‌పై క్విక్‌ ఈ కామర్స్‌ సంస్థలు ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో కాలు బయట పెట్టకండా ఇంటికే సరుకులు వస్తుండడంతో చాలా మంది ఈ కామర్స్‌లోనే అన్నీ ఆర్డర్‌ చేస్తున్నారు. మొదట్లో ఫుడ్‌ డెలివరికి మాత్రమే పరిమితమైన ఈ కామర్స్‌ సంస్థలు ఇప్పడు గుండు పిన్ను నుంచి.. ఎల్‌ఈడీ టీవల వరకు.. కూరగాయల నుంచి వంట పాత్రల వరకూ అగర్‌ బత్తి నుంచి పూజా సామగ్రి వరకు ఇలా అన్నీ సరఫరా చేస్తున్నాయి.

2 లక్షలకుపైగా కిరాణా దుకాణాలు మూత..
దేశ వ్యాప్తంగా క్విక్‌ కామర్స్‌ కంపెనీల హవావ జోరుగా సాగుతోంది. వినియోగదారులు బ్లింక్‌ ఇట్, జెప్ట వంటి పాస్ట్‌ డెలివరి ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆర్డలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంప్రదాయ కిరాణా దుకాణాలు దెబ్బతింటున్నాయి. ఇటీవల పరిశ్రమల సంఘం ఆల్‌ ఇండియా కన్సూ్యమర్‌ ప్రొడక్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ మార్కెట్‌ అధ్యయనం ప్రకారం క్విక్‌ కామర్స్‌ కంపెనీల కారణంగా గడిచిన ఏడాదిలో 2 లక్షలకుపైగా కిరాణా స్టోర్లు, చిన్నా చితక రిటైల్‌ ఔట్‌లెట్లు మూతపడ్డాయి. దేశంలో 1.3 కోట్ల స్టోర్లు క్విక్‌ కామర్స్‌తో ప్రభావితం అయ్యాయి.

నగరాలు, పట్టణాల్లో ఎక్కువ..
క్విక్‌ కామర్స్‌ సేవలు ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం నగరాల్లోని కిరాణా స్టోర్లు, రిటైల్‌ షాపులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. గతేడాది మూతపడిన 2 లక్షల స్టోర్లలో 45 శాతం మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. తర్వాత టైర్‌ 1 నగరాల్లో 30 శాతం ఉన్నాయి, టైర్‌–2, టైర్‌ – 3 నగరాల్లో 25 శాతం దుకాణాలు మూతపడ్డాయి. దాదాపు 3.3 బిలియన్‌ ఆలర్ల దాదాయాన్ని ఆర్జిస్తున్న క్విక్‌ కామర్స్‌ రగంల మెట్రో మార్కెట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది.