US Presidential Elections 2024: నిర్ణేతలు భారతీయ అమెరికన్లే.. అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఓట్లు!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 13 రోజులే సమయం ఉంది. దీంతో కాబోయే అధ్యక్షుడు ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 22, 2024 9:04 am

US Presidential Elections(2)

Follow us on

US Presidential Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది భారతీయ అమెరికన్‌ ఓట్లే. సంఖ్యాపరంగా చూస్తే ఓటర్లు తక్కువగా ఉన్నా.. నానాటికి భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతోంది. దీంతో వాటిని విస్మరిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్‌ పార్టీ, విపక్ష రిపబ్లికన్‌ పార్టీ భారతీయ అమెరికన్‌ ఓట్ల కోసం పోటాపోటీగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు ఉన్న వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఓటర్లుగానే కాకుండా రాజకీయ నేతలుగా, అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తులుగా,నిధులు సేకరించే వారిగా ఇలా అనేక అంశాల్లో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అమెరికా మొత్తం ఓటర్లలో భారతీయ అమెరికన్‌ ఓటర్లు దాదాపు 21 లక్షల మంది ఉంటారు. అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పు సామర్థ్యం స్వింగ్‌స్టేట్స్‌ రాష్ట్రాల్లో భారతీయులకే ఎక్కువగా ఉంది. పెన్సిల్వేనియా, ఆరిజోనా, నెవడా, జార్జియా మిషిగన్, నార్త్‌ కరోలినా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో దక్షిణాసియా ఓటర్లలో భారతీయులే అ«త్యధికంగా ఉన్నారు. అధ్యక్షుడు ఎవరో నిర్ణయించడంలో కీలకమైన పెన్సిల్వేనియాలోని బక్స్‌ కౌంటీలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాలోనూ భారతీయ సంతతి అధికంగా ఉంది.

భారీ స్థాయిలో విరాళాలు
అమెరికాలోని ప్రధాన పార్టీలకు భారతీయ అమెరికన్లు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు. యూఎస్‌ఏలో భారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. ఇది అమెరికన్లత పోలిస్తే 21 శాతం ఎక్కువ. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే 5.5 కోట్ల డాలర్లు విరాళాలుగా వచ్చాయి. వాటిలో ఎక్కువగా భారతీయ అమెరికన్లు ఇచ్చినవే. డెమొక్రటిక్‌ పార్టీ విరాళాల జాబితాలో 60 మందికిపైగా భారతీయ అమెరికన్లు ఉన్నారు. అక్కడి రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న భారతీయులు పెరుగుతున్నారు. సెనేట్, ప్రతినిధుల సభతోపాటు రాస్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు, సిటీ కౌన్సిళ్లు, స్కూల్‌ బోర్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాల అటార్నీలుగా నియమితులవుతున్నారు.

సర్వేలు ఇలా..
అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో సర్వే ఫలితాలు కీలకంగా మారాయి. స్వింగ్‌ రాస్ట్రాల్లో హారిస్, ట్రంప్‌ విజయావకాశాలను భారతీయ ఓటర్లు ప్రభావితం చేస్తారు. అమెరికాలో దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రభావితం చేయడంలో భారతీయ యువ ఓటర్లు కీలకంగా ఉన్నారు. గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీగా ఓటు వేశారని ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. 2020లో 71 శాతం ఇండో అమెరికన్లు ఓటు వేశారు. ఈసారి 90 శాతం మంది ఓటు వేసే అవకాశం ఉందని ఆసియన్‌ అమెరికన్‌ ఓటర్‌ సర్వే అంచనా వేసింది.

భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికి..
ఇదిలా ఉంటే భారతీయ అమెరికన్లలో దాదాపు 55 శాతం మంది డెమొక్రటిక్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. 25 శాతం మంది మాత్రమే రిపబ్లిక్‌ పాఈ్టకి మద్దతు ఇచ్చారు. 15 శాతం మంది స్వతంత్రులకు మద్దతు ఇవ్వగా, మిగిలినవారు తమ అభిప్రాయం చెప్పడానికి ఇష్టపడలేదు.