Japan Airport Bomb Explosion: జపాన్ రెండో ప్రపంచ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన దేశం. రెండు అనుబాంబుల దాడికి గురైంది. ఇప్పటికీ అక్కడి ప్రజలపై అనుబాంబు ప్రభావం ఉంది. పుట్టబోయే పిల్లలపైనా ఎఫెక్ట్ పడుతోంది. ఇదిలా ఉంటే.. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో తాజాగా జపాన్ విమానాశ్రయంలో బాంబు పేలింది. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో పాతిపెట్టిన బాంబు ఇన్నాళ్లకు బుధవారం(అక్టోబర్ 2న)పేలింది. దీంతో టాక్సీ మార్గంలో పెద్ద గుంత ఏర్పడింది. పేలుడు నేపథ్యంలో జపాన్ 80కిపైగా విమానాలను దర్దు చేసినట్లు జపాన్ అధికారులు తెలిపారు. అయితే తాజా పేలుడులో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. పేలుడ జరిగిన ప్రాంతానికి సమీపంలో బాంబులు కూడా లేవని తెలిపారు.
బాంబు పేలినట్లు నిర్ధారణ..
పేలుడు జరిగిన వెంటనే రంగంలోకి దిగిన జపాన్ ఆత్మరక్షణ దళాలు.. తనిఖీలు నిర్వహించాయి. పేలుడుపై దర్యాప్తు చేపట్టాయి. బాంబు కారణంగానే పేలుడు జరిగిందని నిర్ధారించారు. తర్వాత ప్రమాదం లేదని నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. పేలుడు దృశ్యాలు సమీపంలోని ఏవియేషన్ స్కూల్‌లోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పేలుడు ధాటికి తారు ముక్కలను ఫౌంటేన్‌లా గాలిలో చిమ్మడం అందులో కనిపించింది. జపనీస్ టెలివిజన్‌లో ప్రసారమైన వీడియోలో టాక్సీవేలో సుమారు 7 మీటర్ల వ్యాసం, 1 మీటరు లోతులో గుంత ఏర్పడనిట్లు తెలిపింది.
విమానాలు రద్దు..
పేలుడు కారణంగా బుధవారం మధ్యాహ్నం 80కిపైగా విమానాలు రద్దు చేసినట్లు చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిమాసా హయాషి తెలిపారు. ట్యాక్సీవే డ్యామేజ్‌ని రాత్రికి రాత్రే సరిచేశామని, గురువారం ఉదయం విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయని విమానాశ్రయం తెలిపింది. మియాజాకి విమానాశ్రయం 1943లో మాజీ ఇంపీరియల్ జపనీస్ నేవీ ఫ్లైట్ ట్రైనింగ్ ఫీల్డ్‌గా నిర్మించబడింది, దీని నుంచి కొంతమంది పైలట్లు ఆత్మాహుతి దాడి మిషన్‌లకు బయలుదేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం వేసిన పేలని బాంబులు ఈ ప్రాంతంలో బయటపడ్డాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. యుద్ధ సమయంలో వందల టన్నుల పేలని బాంబులు జపాన్ చుట్టూ పాతిపెట్టబడ్డాయి. కొన్నిసార్లు నిర్మాణ ప్రదేశాలలో బయటపడ్డాయి.
Miyazaki Airport in Japan was temporarily closed after an unexploded American Bomb from World War II was detonated near its runway, creating a crater 7 Meters. pic.twitter.com/cpEBGlxhgd
— Truthseeker (@Xx17965797N) October 2, 2024