Another danger for Pakistan: భారత్‌కు నష్టం కలిగించడమే లక్ష్యంగా దశాబ్దాలుగా పనిచేస్తున్న దేశం పాకిస్తాన్. మన దయతో ఏర్పడిన ఆ దేశం.. ఇప్పుడు మనకే ఇబ్బందిగా మారింది. మన కోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థలే ముప్పుగా మారుతున్నాయి. ఇంతకాలం ఆఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లతో సత్సవంబంధాలు నెరపిన పాక్.. ఇప్పుడు తెహ్రీక్–ఎ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో ఇబ్బందులు పడుతోంది. టీటీపీని నాశనం చేయడానికి ఆఫ్గాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. ఇటీవల వరుస దాడులతో ఆఫ్గానిస్తాన్‌లో సామాన్యులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీటీపీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సలీం హక్కానీ నేతృత్వంలో ఈ యూనిట్ పాక్ సైన్యానికి పోటీగా పనిచేయనుంది. కశ్మీర్, గిల్గిట్–బాల్టిస్తాన్‌తోపాటు ప్రావిన్స్‌లను లక్ష్యంగా చేసుకుని, మిలిటరీ కమాండర్లతో పర్యవేక్షణ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక.
2022 ఒప్పందం రద్దు..
2022 నవంబరులో పాక్ ప్రభుత్వంతో చేసిన శాంతి ఒప్పందాన్ని టీటీపీ ఏకపక్షంగా ఉపసంహరించింది. ఆ తర్వాత ఖైబర్ పక్తుంఖ్వా, బలూచిస్తాన్‌లో భద్రతా దళాలపై వరుస దాడులు చేపట్టింది. అఫ్గానిస్తాన్ నుంచి నడిచే ఈ ఉగ్రవాదులు పోలీసులు, అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అఫ్గాన్ తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీ కార్యకలాపాలు పెరిగాయి. పాక్ అధికారులు అఫ్గాన్ భూభాగం నుంచి దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే తాలిబాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. సోషల్ మీడియాలో ప్రకటనలు పాక్ అధికారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి.
నాయకత్వ మార్పులు..
మిలిటరీ యూనిట్లలో కొత్త నాయకుల నియామకాలు, ప్రావిన్స్ వారీగా బలోపేతం చేస్తోంది. ఈ వ్యూహం పాక్ సైన్యానికి గట్టి సవాలుగా మారనుంది. టీటీపీ బలహీనతలను పరిమితం చేసి, స్థిరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది.
పాకిస్తాన్ భద్రతకు ముప్పు..
ఇప్పటికే టీటీపీ వైమానిక దళం లేకపోయినా పాకిస్తాన్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇటీవల టీటీపీ పాకిస్తాన్‌కు చెందిన 90 మంది సైనికులను బంధీగా పట్టుకున్నారు. వైమానిక దళం లేకపోవడం ఇంతకాలం బలహీనతగా మారింది. కానీ ఇప్పుడు అది కూడా ఏర్పాటు చేయబోతోంది. దీంతో అఫ్గాన్–పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను గమనిస్తోంది. పాక్ ప్రభుత్వం కొత్త వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.