KTR strong counter: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధి అని చెప్పే నాయకులే.. తమ నోటికి వచ్చినట్లు.. వినడానికి కూడా ఇబ్బందిగా ఉండే మాటలతో దూషించుకుంటున్నారు. నువ్వు మొగోడివైతే మీడియా ముందుకు రా అని కేటీఆర్ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరుసటి రోజే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. రేవంత్‌రెడ్డి తోలు తీస్తం అని హెచ్చరించాడు. దీంతో రేవంత్ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ముగ్గురినీ కలిపి వాయించాడు. కొడంగల్ సభలో తీవ్ర పదాలతో విరుచుకుపడ్డాడు. కేసీఆర్‌ను మస్తాన్ మటన్ సాప్‌లో మేకల తోలు తీసుకుని బతకాలని సూచించాడు. అయ్యేపేరు చెప్పుకు బతికే పేడు మూతోడు అని కేటీఆర్‌ను ధూషించారు. మనిషి పెరిగిండు కానీ, తలయాక లేనోడు హరీశ్ అని మండిపడ్డారు. తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తండ్రి పేరు చెప్పడంలో తప్పు ఏముందని ప్రశ్నించి, ‘మా అయ్య తెలంగాణ తెచ్చిన మొనగాడు‘ అని స్పష్టం చేశారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నోప్పి అని నిలదీశారు.
నీ అల్లుడు ఆంధ్రోడు కాదా?
విమర్శల్లో భాగంగా కేటీఆర్ రేవంత్ అల్లుడి ప్రస్తావన కూడా చేశారు. నీ అల్లుడు ఆంధ్రోడు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌కే రేవంత్ ముచ్చెమటలు పట్టాయని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. రేవంత్ గుండె ఆగిపోతుందని హెచ్చరించారు.
ఎన్నికల హామీలపై నిలదీత..
కల్యాణలక్ష్మీలో లక్ష రూపాయలు, తులం బంగారం, మహిళలకు రూ.2500 హామీలు ఇచ్చి ఎగవేసిన రేవంత్ ఇప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెబుతున్నాడని విమర్శించారు. జనవరి 1 నుంచి రూ.2500 ఇస్తానని శపథం చేయాలని సవాల్ విసిరారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ లెక్క తేల్చాలి..
పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను వెనక్కి పంపడం, 10% పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని కేసీఆర్ అడిగినప్పుడు రేవంత్ కోపం వచ్చిందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని అడగడంలో తప్పు ఏముందని నిలదీశారు. రేవంత్‌ను కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడించే బాధ్యత తీసుకుంటానని సవాల్ చేశారు. ‘ఎనుముల రేవంత్ కాదు, ఎగవేతల రేవంత్‘ అని పేర్కొన్నారు.
ఈ డైలాగ్ వార్ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. కేసీఆర్ అధికారానికి మళ్లీ రాకుండా చేస్తానని రేవంత్ శపథాలకు కేటీఆర్ ప్రత్యామ్నాయ సవాల్‌లు విసురుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది.