US Presidential Election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే? బేబీ హిప్పో ఏం చెప్పిందంటే.. వైరల్ వీడియో

అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు ప్రారంభమయ్యాయి.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ నేతలు ఎవరి అంచనాలలో వారు ఉన్నారు.

Written By: NARESH, Updated On : November 5, 2024 9:39 pm

Donald trump

Follow us on

US Presidential Election : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారో అనే విషయాన్ని థాయిలాండ్ ప్రాంతానికి చెందిన ఓ హిప్పో జోస్యం చెప్పింది. అది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలహరిస్ ఉన్నారు. రిపబ్లికిన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోరు హోరా హోరీగా ఉంటుందని అంతర్జాతీయ మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. రాజకీయ విశ్లేషకులు సైతం ద్రువీకరించారు. సర్వే సంస్థలలో కొన్ని ట్రంప్ వైపు.. మరికొన్ని కమలవైపు ఉన్నాయి. ఆధిక్యం విషయంలో మాత్రం ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంటుందట. అగ్రరాజ్యం కావడంతో అమెరికా ఎన్నికలను ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.. ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చర్చ మొదలైంది. చైనీస్ మీడియా నుంచి మొదలు పెడితే భారత మీడియా వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిశితంగా గమనిస్తోంది.

గెలుపు ఎవరిదంటే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అనే విషయాన్ని థాయిలాండ్ ప్రాంతానికి చెందిన ఓ హిప్పో చెప్పింది. అది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. కమల, ట్రంప్ లో ఎవరు తదుపరి అమెరికాకు అధ్యక్షులు అవుతారని థాయిలాండ్ ప్రాంతంలోని సిరాచా లో ఖావో ఖీవ్ ఓపెన్ జూ లో నిర్వాహకులు ఒక చిన్న పోటీ నిర్వహించారు. ఇందులో ఇంటర్నెట్ సంచలనం బేబీ హిప్పో పాల్గొంది. దాని పేరు మూ డెంగ్. అయితే తదుపరి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ గెలుస్తాడని అది జోస్యం చెప్పింది.. అయితే అది ఇలా చెప్పడానికి జూ నిర్వాహకులు ఒక పోటీ నిర్వహించారు. అత్యంత భారీ గుమ్మడికాయను రెండు ముక్కలు చేశారు. ఒక ముక్కలో ట్రంప్, మరొక ముక్కలో కమల పేరు రాశారు. ఆ హిప్పో ఏ గుమ్మడికాయ ముక్క తింటే.. వారే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తారని భావించారు. అయితే ఈ పోటీలో హిప్పో అత్యంత తెలివిగా ట్రంప్ పేరుగున్న గుమ్మడికాయ మొక్కను కొరికి తినేసింది. అంతేకాదు అమెరికా దేశానికి తదుపరి అధ్యక్షుడు ట్రంప్ అని తేల్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. థాయిలాండ్ ప్రాంతంలో మూ డెంగ్ హిప్పో అత్యంత ప్రాచుర్యం పొందింది. దీనికి సామాజిక మాధ్యమాలలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. అది మూన్ వాక్ స్టెప్స్ వేయడంలో నేర్పరి. దానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాని వీడియోలు సోషల్ మీడియాలో అనేకసార్లు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. హిప్పో జోస్యం ఎలా ఉన్నప్పటికీ.. అది వెంటనే గుమ్మడికాయ ముక్క తినడం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ వీడియోను కొంతమంది సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త విస్తృతమైన చర్చకు దారితీస్తోంది. అయితే అమెరికా ఎన్నికల్లో ఈసారి హోరాహోరీగా పోరు ఉంటుందని తెలుస్తోంది. అమెరికా అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని కమల ప్రచారం చేస్తే.. అమెరికాకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తాను కృషి చేస్తానని ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పైగా ఆ మధ్య ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అప్పట్లో అది సంచలనంగా మారింది. ఆ తర్వాత బైడన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కమలను అధ్యక్ష అభ్యర్థిగా వెల్లడించారు.