Iran-Israel : రష్యా -ఉక్రెయిన్ యుద్ధం రావణకాష్టం లాగా రగులుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచం రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. దీన్ని మర్చిపోకముందే ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య చాలా కాలం నుంచి వైరం ఉంది. అయినప్పటికీ రెండు దేశాలు పరస్పరం ఎప్పుడూ దాడులు చేసుకోలేదు. అయితే ఈసారి ఇజ్రాయిల్ నేరుగా ఇరాన్ పై దాడికి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనికి ఇరాన్ కూడా ప్రత్యక్ష దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఇజ్రాయిల్ కు మద్దతుగా అమెరికా సీన్ లోకి వచ్చింది. ఇక ప్రస్తుత పరిస్థితి ప్రకారం రెండు దేశాల సైనిక బలాలను ఒకసారి పరిశీలిస్తే..
సైనిక బలం విషయంలో ప్రపంచం లోనే ఇరాన్ 14వ స్థానంలో కొనసాగుతోంది. ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. ఇరాన్, ఇజ్రాయిల్ వద్ద హై రేంజ్ మిస్సైల్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న మిస్సైల్స్ లో 2,500 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయోగించవచ్చు. ఆ మిస్సైల్స్ లో కైబర్ 2000 కిలోమీటర్లు, హజ్ ఖాశీమ్ 1,400 కిలోమీటర్లు, షాహబ్ -3 800 నుంచి 1000 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేదిస్తాయి. ఇజ్రాయిల్ దగ్గర ఉన్న జెరికో -1 1,400, జెరికో -3 5,000 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను చేదించగలవు .. ఇరాన్ దగ్గర ఖలీద్ ఫర్జ్ నౌకా విధ్వంసాన్ని సృష్టించే క్షిపణులు ఉన్నాయి. ఇజ్రాయిల్ దగ్గర ఖండాంతర ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన మొహజెర్ -10 అనే అత్యంత అధునాతనమైన డ్రోన్ ఉంది. దానికి తగ్గట్టుగా పేట్రియాట్, యారో, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ వంటి అధునాతన వ్యవస్థలు ఇజ్రాయిల్ వద్ద ఉన్నాయి..
అణు ఆయుధాల పరంగా..
అణు ఆయుధాలను పరిశీలిస్తే.. ఇరాన్ వద్ద హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఉంది. ఇజ్రాయిల్ వద్ద 90 అణు బాంబులు ఉన్నాయి. ఇరాన్ వద్ద 3.5 లక్షల రిజర్వ్ దళాలు ఉన్నాయి. ఇజ్రాయిల్ వద్ద 4.65 లక్షల రిజర్వ్ దళాలు ఉన్నాయి.. ఇరాన్ సైనిక సిబ్బంది మొత్తం 6.1 లక్షలు. ఇజ్రాయిల్ వద్ద 1.7 లక్షల సైనికులు ఉన్నారు. ఇరాన్ వద్ద 1,966 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇజ్రాయిల్ వద్ద 1,370 యుద్ధ ట్యాంకులున్నాయి. ఇరాన్ టోవ్డ్ ఆర్టీలరీ 2,050, ఇజ్రాయిల్ టోవ్డ్ ఆర్టీలరీ 300 మాత్రమే. ఇరాన్ దగ్గర 580, ఇజ్రాయిల్ దగ్గర 650 శతఘ్నులు ఉన్నాయి.
రాకెట్ లాంచర్ల విషయంలో..
ఇరాన్ దగ్గర 775 రాకెట్ లాంచర్లు ఉన్నాయి. ఇజ్రాయిల్ వద్ద 150 రాకెట్ లాంచర్లు ఉన్నాయి.. ఇరాన్ 65,765 సాయుధ వాహనాలను కలిగి ఉండగా.. ఇజ్రాయిల్ వద్ద 43,407 వాహనాలు ఉన్నాయి. ఇరాన్ వద్ద 101 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇజ్రాయిల్ వద్ద 67 ఉన్నాయి. జలాంతర్గాములు ఇరాన్ వద్ద 19 ఉన్నాయి. ఇజ్రాయిల్ వద్ద ఐదు మాత్రమే ఉన్నాయి. ఫ్రి గేట్లు ఇరాన్ వద్ద ఏడు ఉండగా.. ఇజ్రాయిల్ దగ్గర లేవు.
కార్వేట్లు ఇజ్రాయిల్ వద్దే ఎక్కువ
కార్వేట్లు ఇరాన్ వద్ద మూడు ఉండగా.. ఇజ్రాయిల్ వద్ద ఏడ ఉన్నాయి. ఇరాన్ చేతిలో 21 గస్తీ నౌకలు ఉన్నాయి. ఇజ్రాయిల్ లో వీటి సంఖ్య 45 గా ఉంది. యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద 551, ఇజ్రాయిల్ దగ్గర 612 ఉన్నాయి. ఫైటర్ జెట్ విమానాలు ఇరాన్ వద్ద 186, ఇజ్రాయిల్ వద్ద 241 ఉన్నాయి. రవాణా విమానాలు ఇజ్రాయిల్ వద్ద 40, ఇరాన్ దగ్గర ఏడు ఉన్నాయి. హెలికాప్టర్లు ఇజ్రాయిల్ వద్ద ఎక్కువగా ఉన్నాయి. వాటి సంఖ్య 146, ఇరాన్ వద్ద 129 హెలిక్యాప్టర్లున్నాయి. ఫైటర్ హెలికాప్టర్ల విషయంలో ఇరాన్ ఇజ్రాయిల్ తో పోల్చితే వెనుకబడి ఉంది. ఇరాన్ వద్ద 13, ఇజ్రాయిల్ వద్ద 48 ఫైటర్ హెలికాప్టర్లు ఉన్నాయి. స్థూలంగా చూస్తే తన వద్ద ఉన్న సైనిక బలగం ద్వారా ఇరాన్ 8.75 కోట్ల జనాభాను కాపాడుకోవాలి. ఇజ్రాయిల్ 90 లక్షల మంది జనాన్ని రక్షించాలి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More