America: అమెరికాలో ఉన్నత చదువులు చదువుకునేందుకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు శవపేటికల్లో తిరిగి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యకాలంలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా మరో తెలుగు విద్యార్థి అగ్రరాజ్యంలో అసువులుబాసాడు. ఈ ఏడాది ఇప్పటికే 10 మంది వివిధ కారణాలతో మరణించారు.
అనుమానాస్పద మృతి..
అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో నివసిస్తున్న తెలుగు విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె తన నివాసంలో శవమై కనిపించాడు. ఈమేరకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
బాధిత కుటుంబానికి సమాచారం..
భారత్‌లో సత్యసాయి కుటుంబానికి భారత రాయబార కార్యాలయం సమాచారం అందించింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించడానికి అవసమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈమేరు అధికారిక ఎక్స్‌లో సమాచారం పోస్టు చేసింది. అయితే మరణానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.
నాలుగు నెలల్లో 10 మంది..
ఇదిలా ఉండగా గడిచిన నాలుగు నెలల్లో అమెరికాలో 10 మంది భారతీయ విద్యార్థులు వేర్వేరు కారణాలతో మరణించారు. మరోవైపు భారతీయులపై దాడులు కూడా పెరుగుతున్నాయి. మార్చిలో భారత్‌కు చెందిన శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్‌ను మిస్సోరిలోని సెయింట్ లూయీస్‌లో కాల్చి చంపేశారు.
= బోస్టన్ యూనివర్సిటీలో చదువుకునే గుంటూరు విద్యార్థి పరుచూరి అభిజిత్ మృతదేహాన్ని ఓ కారులో గుర్తించారు.
= క్లీవ్‌ల్యాండ్‌లో నివసించే భారత్‌కే చెందిన మహ్మద్ అబ్దుల్ అరాఫత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
= హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో దుండగులు దాడిచేశారు.
= పర్డూ యూనివర్సిటీలో సమీర్‌కామత్ అనే 23 ఏళ్ల విద్యారి ఫిబ్రవరి 5న ఇంĶడియానాలో శవమై కనిపించడు. పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య అనుమానాస్పదంగా మృతిచెందాడు.
= జార్జియాలో వివేక్ సైనీ దారుణంగా హత్యకు గురయ్యాడు.
= ఐటీ నిపుణుడు వివేక్ తనేజాపై వాషింగ్‌టన్‌లోని ఓ రెస్టారెంట్ సమీపంలో దాడి చేశారు. ఇలా వరుస మరణాలు దాడులు భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.