Taiwan government kill iguanas
Taiwan : తైవాన్ చాలా చిన్న, పర్యాటకులను ఆకర్షించే దేశం. పొరుగున ఉన్న చైనా తైవాన్‌ను కబ్జా చేద్దామని చూస్తోంది. దీంతో ఇప్పటికే రెండు దేశాల మధ్య వైరం నెలకొంది. ఇక్కడి ప్రధాన వృత్తులు వ్యవసాయంతోపాటు చేపల వేట ముఖ్యమైనవి. ఇక పర్యాటకంగా కూడా తైవాన్ అందాలు ఆకట్టుకుంటాయి. అందుకే ఏటా వందల మంది పర్యాటకులు వస్తారు. ఇదిలా ఉంటే.. తైవాన్‌లో రైతులు ప్రస్తుతం సమస్య ఎదుర్కొంటున్నారు. తైవాన్‌లోని ఇగ్వానా అనే జీవులు దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 1.20 లక్షల ఇగ్వానాలను చంపాలని చూస్తోంది. సాంకేతిక విధానంలో కాకుండా అతి దారుణ పద్ధతుల్లో వీటిని అంతం చేయాలని ఆలోచన చేస్తోంది.
2 లక్షలకుపైగా..
ద్వీప దేశమైన తైవాన్‌లో 2 లక్షలకుపైగా ఇగ్వానాలు ఉన్నాయి. ఆకుపచ్చ రంగులో ఉండే ఇగ్వానాలు బల్లుల జాతికి సంబంధించిన సరీసృపాలు. ఇవి ఆకుల నుంచి ఆహారం తీసుకుంటాయి. ఇందుకోసం గుంపులుగా పంట పొలాల్లో చొరబడి నాశనం చేస్తుంటాయని అంటున్నారు. ఇటీవల వీటి బెడద ఎక్కువైంది. దీంతో మొదటి విడతలో సుమారు 70 వేల ఇగ్వానాలను చంపేసింది. ఇందుకు ఒక్కో జీవికి 15 డాలర్లు చెల్లించింది. అయినా ఏడాదిలో వాటి సంఖ్య రెట్టింపయింది. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే జీవిస్తాయి. గ్రామ శివారులో ఉంటాయి. వీటి గూళ్లను గుర్తించడంలో సహకరించాలని స్థానికులను ప్రభుత్వం కోరుతోంది. ఈటలు, విషపు గుళికలు, బాణాలతో చంపేలా మార్గదర్శకాలు జారీ చేసే యోచనలో ఉంది. సాధారణంగా బల్లులు క్రిములు, కీటకాలను తింటాయి. అయితే అదే జాతికి చెందిన ఇగ్వానాలు మాత్రం శాఖాహారులు. ఎక్కువ ఆకులు, పండ్లు, చిన్నపాటి మొక్కలు తింటాయి.
భారీ పరిమాణం..
ఇక ఇగ్వానాలు చేస్తే సాధారణంగా ఉండవు. 2 అడుగుల వరకు పెరుగుతాయి. బరువు 5 కిలోల వరకు ఉంటాయి. 20 ఏళ్ల వరకు జీవిస్తాయి. ఇక వాటిని పెంచుకునేందుకు ఆలోచన చేస్తున్నారు.. కానీ అవి పంటలను దెబ్బతీస్తుండడంతో ఇప్పుడు చంపాలను చూస్తున్నారు.