Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషీకి ఎదురుగాలి.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

మూడేళ్లుగా దేశ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి(ప్రధాని, మంత్రుల రాజీనామాలు.. తొలగింపులు), ఇక భారత సంతతికి చెందిన ప్రధాని రిషీ సునాక్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఇమేజ్‌ మరింత దిగజారిపోయిందని సర్వేలు చెబుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : April 5, 2024 9:56 am

UK PM Rishi Sunak to Face Worst Defeat

Follow us on

Rishi Sunak: బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ 15 ఏళ్లుగా అధికారంలో ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అది కూడా చిత్తుచిత్తుగా అని పేర్కొంటున్నాయి. మూడేళ్లుగా దేశ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి(ప్రధాని, మంత్రుల రాజీనామాలు.. తొలగింపులు), ఇక భారత సంతతికి చెందిన ప్రధాని రిషీ సునాక్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఇమేజ్‌ మరింత దిగజారిపోయిందని సర్వేలు చెబుతున్నాయి.

వచ్చే ఏడాది ఎన్నికలు..
ఇక వచ్చే ఏడాది బ్రిటన్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ కన్జర్వేటర్‌ పార్టీని చిత్తుగా ఓడిస్తుందని సర్వేలో వెల్లడైంది. అధికారంలో ఉన్న కన్జర్వేటివ పార్టీ గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలీను నెరవేర్చకపోగా.. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. లివింగ్‌ కాస్ట్‌ భారీగా పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణాలు అని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి.

సర్వే ఫలితాలు ఇలా..
మార్చి 7వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మార్చి 7వ తేదీ నుంచి 27 తేదీ మధ్య యూజీవోవీ సంస్థ పబ్లిక్‌ సర్వే నిర్వహించింది. అందులో 18,761 మంది పౌరులు పాల్గొన్నారు. ఇందులో మెజారిటీ ప్రజలు లేబర్‌ పార్టీకి ఓటేస్తామని తెలిపారు. ఇక బ్రిటన్‌ పార్లమెంటులో మొత్తం 650 స్థానాలు ఉండగా, అధికారంలోకి రావాలి అంటే ఏ పార్టీకి అయినా 326 స్థానాలు కావాలి. అయితే యూజీవోవీ సర్వేలో లేబర్‌ పార్టీకి 403 స్థానాలు, కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 155 స్థానాలు దక్కించుకుంటాయని సదరు సర్వే తెలిపింది. ఇక ఈ ఏడాది జనవరిలో ఇదే సంస్థ జరిపిన సర్వేలో కన్జర్వేటివ్‌ పార్టీకి 169 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. తాజా సర్వేలో ఆ స్థానాలు మరింత తగ్గడం గమనార్హం. ఇక పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ పోలిటికో సైతం ఇలాంటి ట్రెండ్‌నే ప్రకటించింది. మార్చి 31న వెల్లడించిన సర్వేలో.. లేబర్‌ పార్టీకి 44 శాతం, కన్జర్వేటివ్‌ పార్టీకి 23 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

ఇదిలా ఉండగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ 2022, అక్టోబర్‌ 24న బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ముందు పెను సవాళ్లు ఉండగా, ఆయన వాటిని అధిగమిస్తామని హామీ ఇచ్చారు. కానీ, రిషి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బ్రిటన్‌ సంక్షోభం మరింత ముదిరింది. దీంతో కన్జర్వేటివ్‌ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. రిషిపైనా విమర్శలు పెరిగాయి.