Telangana: మందు బాబులకు షాక్‌.. నీళ్లే కాదు.. బీర్లూ దొరకవు.. తెలంగాణలో ఇదీ పరిస్థితి!

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మైక్రో బ్రూవరీలకు భారీగా అనుమతులు ఇచ్చింది. దీంతో బీర్ల తయారీ తెలంగాణలోనే సాగుతూ వచ్చింది.

Written By: Raj Shekar, Updated On : April 5, 2024 9:45 am

Beer shortage in Telangana

Follow us on

Telangana: వేసవి ప్రారంభమైంది. ఎండలు దంచికొడుతున్నాయి. జల వనరులు అడుగంటుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందిలు మొదలయ్యాయి. ఒకవైపు పంటలు ఎండుతుంటే.. మరోవైపు తాగునీరు కోసం ప్రజలు కోడ్లెక్కుతున్నారు. ఇదిలా ఉంటే.. వేసవి కాలంలో మందు బాబులు ఇష్టపడే బీర్లకు కూడా కష్టకాలం వచ్చేలా ఉంది. నీటి కొరత కారణంగా తెలంగాణలో బీర్ల ఉత్పత్తి తగ్గుతోంది. బీర్ల సరఫరాకు డిమాండ్‌ పెరుగుతోంది. అయితే స్థానికంగా ఉన్న నీరు సరిపోకపోవడంతో రెండు నెలలు బీర్ల ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఆదాయం కోల్పోతుందని పేర్కొంటున్నారు.

గత ప్రభుత్వంలో భారీగా అనుమతులు..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మైక్రో బ్రూవరీలకు భారీగా అనుమతులు ఇచ్చింది. దీంతో బీర్ల తయారీ తెలంగాణలోనే సాగుతూ వచ్చింది. అయితే బీర్ల తయారీకి నీళ్లు చాలా ముఖ్యం. నీటి వనరు కచ్చితంగా ఉండాలి. తాజాగా ఈ ఏడాది కరువుతో బీర్ల తయారీకి నీళ్లు దొరకడం లేదు. హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో బీర్ల ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కంపెనీల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి దొరకడం లేదు. పని కోల్పోతున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.1200 కోట్ల ఆదాయం కోల్పోయే వకాశం ఉన్నట్లు అంచనా.

1999 తర్వాత మళ్లీ..
గతంలో 1999లో నీటి కొతర కారణంగా బీర్ల తయారీపై ప్రభావం పడింది. మళ్లీ ఇన్నేళ్లకు అలాంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సింగూర్‌ జలాశయం నుంచి నాలుగు బీర్ల తయారీ పరిశ్రమలకు నామమాత్రపు ధరకు 44 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసింది. ప్రస్తుతం జలాశయంలో నీరు అడుగంటింది. తాగునీటికి సరపడా నీరు మాత్రమే ఉంది. దీంతో బ్రూవరీలకు నీటిని ఇవ్వడం లేదు. దీంతో బీర్ల ఉత్పత్తి నిలిచిపోయే అవకావం కనిపిస్తోంది. ఇక సింగూరు, మంజీర రిజర్వాయర్లలో నీటిమట్టం తగినంతగా లేకపోతోంది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ప్రయివేటు వనరుల నుంచి నీటిని సేకరించడం కష్టంగా ఉంది. దీంతో అందువల్ల, ఎస్‌ఏబీ మిల్లర్‌ ఇండియా, యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్, కార్ల్స్‌బర్డ్‌ ఇండియా, క్రౌన్‌ బీర్స్‌ కంపెనీలకు నీటిని ఇవ్వడంలేదు. ఫలితంగా బీర్ల ఉత్పత్తి తగ్గిపోయింది.